ఇదిగో.. ఈ ఫుడ్‌తోనే మీ ఇమ్యూనిటీ పవర్‌ తగ్గిపోతుంది!

-

కరోనాతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. దేశంలో కూడా అదే పరిస్థితి, మరోవైపు మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ కరోనా టీకాను వేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో మన శరీరానికి ఇమ్యూనిటీ పవర్‌ చాలా ముఖ్యమైంది. సెకండ్‌ వేవ్‌ కరోనా వైరస్‌ చాలా ప్రమాదకరమైందని వైద్యులు సైతం హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజు ఎక్సర్‌సైజ్, ఆరోగ్యంతో పాటు శక్తినిచ్చే ఆహారం తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్‌ పెరుగుతుంది. కానీ, మనం తీసుకుంటున్న కొన్ని ఆహార పదార్థాలతో మన శరీర వ్యాధి నిరోధర శక్తిని తగ్గిపోతుంది. వివిధ పరిశోధనల తర్వాత ఇమ్యూనిటీ పవర్‌ కోల్పోవడానికి ఈ ఆహార పదార్థలు చాలా ప్రమాదకర స్థాయిలోకి నెట్టివేస్తుంది. మీరు తినే ఆహారంలో ఆశ్చర్యకరంగా మీ శరీర ఇమ్యూనిటీ పవర్‌ను తగ్గించే ఈ 6 రకాల ఆహార పదార్థాలను వెంటనే తీసివేయండి.


చక్కెర పదార్థలు

నేచురల్‌గా తియ్యదననిచ్చే తేనె, బెల్లం వంటివి శరీరానికి మంచివి. కానీ, చెక్కెర కలిపిన పదార్థాలు మీ శరీర ఇమ్యూనిటీ పవర్‌ను తగ్గించేస్తుంది. షుగర్‌ క్యాండీస్, చక్కెర కలిపిన జ్యూస్‌లు, తినుబంఢారాలు, కేక్‌లు వంటి చక్కెర కలిపిన పదార్థాల వల్ల శరీరానికి హాని కలుగుతుంది.

ఫాస్ట్‌ఫుడ్‌

ఫాస్ట్‌ఫుడ్‌కు కూడా దూరంగా ఉండాలి. ఫాస్ట్‌ఫుడ్‌ వల్ల శరీరంలో చక్కెర, సోడియం, సాచురేటడ్‌ ఫ్యాట్‌ వల్ల మీ ఇమ్యూనిటీ పవర్‌ తగ్గిపోతుంది. వీటిలో ఫైబర్‌ ఉండదు కావునా, ఇది మీ ఇమ్యూనిటీ పవర్‌ను మెల్లగా తగ్గించేస్తుంది.

సొడా

సొడాలో ఎక్కువ శాతం షుగర్‌ కేలరీస్‌ ఉంటాయి. దీనివల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పూర్తిగా తగ్గించేస్తుంది. వీటిలో ఎటువంటి న్యూట్రాన్స్‌ కూడా ఉండవు. దీనివల్ల బరువు కూడా పెరుగుతారు. దీనికి బదులుగా దానిమ్మ రసాన్ని తీసుకోవచ్చు. వాటిలో ఎటువంటి చక్కెర కలపరు కాబట్టి, శరీరానికి చాలా మేలు చేస్తుంది.

ఐస్‌క్రీం

ఎక్కువ శాతం క్రీం, తీపితో కూడిన ఐస్‌క్రీంలో సాచురేటడ్‌ ఫ్యాట్‌ ఉండటం వల్ల ఇమ్యూనిటీ పవర్‌ తగ్గిపోతుంది. అంతగా మీకు తినాలనిపిప్తే, బయట చేసిన ఐస్‌క్రీంలు కొనడం కంటే నేచురల్‌ పద్ధతిలో ఇంట్లోనే ఐస్‌క్రీం తయారు చేసుకోవడం మంచిది. అదేవిధంగా నట్స్, బెర్రీస్, తేనె తినడం కూడా మన శరీరానికి ఎంతో మంచిది.

సోడియం ఆధారిత ఫుడ్‌

క్యాన్డ్‌ ఫుడ్, ఫ్రోజెన్‌ మీట్, వెజిటేబుల్స్, పిజ్జా, స్నాక్స్‌ మన శరీరానికి అస్సలు మంచివి కావు. సోడియం ఆధారిత ఫుడ్‌ తీసుకోవడం వల్ల బీపీ లెవల్స్‌ పెరిగిపోతుంది. ఇది అనారోగ్య పరిస్థితులకు దారి తీస్తుంది.

చిప్స్‌

ఆలుగడ్డతో తయారు చేసిన చిప్స్‌ వల్ల ఇమ్యూనిటీ పవర్‌ దారుణంగా పడిపోతుంది. వీటిలో ఎటువంటి న్యూట్రిషన్‌ ఉండదు. ఎక్కువ శాతం వీటిని తినకపోవడమే మేలు. దీనికి బదులుగా అరటి పండ్లు, బ్లాక్‌ బీన్స్, ఖర్జురం తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్‌ పెరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version