హుజురాబాద్ ఎన్నిక‌ల్లో పోటీకి నిరుద్యోగులు.. ?

-

హుజూరాబాద్ ఉప ఎన్నికల పై వైఎస్ షర్మిల సంచలన వాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు అంతా హుజూరాబాద్ లో నామినేషన్లు వేయాల‌ని ష‌ర్మిల పిలుపునిచ్చారు. నేతన్న ల భార్యలు కూడా నామినేషన్ లు వేస్తామని అంటున్నారంటూ ష‌ర్మిల వ్యాఖ్యానించారు. రెండు వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్ లు నామినేషన్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని ష‌ర్మిల వ్యాఖ్యానించారు. పసుపు బోర్డ్ పెడతామని మోసం చేసిన కేసీఆర్ కు నిజామాబాద్ లో చేదు అనుభవం ఎదురైంద‌ని ష‌ర్మిల అన్నారు.

youth in huzurabad election

ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక కూడా దేశ వ్యాప్తంగా చర్చ కు రావాలంటూ ష‌ర్మిల వ్యాక్యానించారు.
కేసీఆర్ నిరంకుశ పాలన పై చర్చ జరగాలని ష‌ర్మిల తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులు హుజూరాబాద్ లో ఓటు నమోదు చేసుకోవాల‌ని ష‌ర్మిల అన్నారు. ఇదిలా ఉండ‌గా ష‌ర్మిల ముందు నుండి నిరుద్యోగుల కోసం పోరాడుతున్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణ లోని నిరుద్యోగుల‌కు మ‌ద్ద‌తు ఇస్తూ ష‌ర్మిల త‌న పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళుతున్నారు. ఇక ఇప్పుడు హుజురాబాద్ ఎన్నిక‌ల్లోనూ నిరుద్యోగుల‌ను పోటీ చేయాల‌ని పిలుపునివ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version