ఏపీలోని కృష్ణా జిల్లాలో గంజాయి బ్యాచ్ మరోసారి రెచ్చిపోయింది. మత్తులో ఉన్న కొందరు యువకులు వీరంగం సృష్టించారు. హోటల్‌కు వెళ్లిన వారు అక్కడ యజమానితో గొడవకు దిగారు. అంతటితో ఆగకుండా అతనిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు.
ఈ ఘటన కృష్ణాజిల్లాలోని పెనమలూరులో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. గంజాయి మత్తులో యువకులు వీరంగం చేస్తుండగా.. స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే, హోటల్ యజమానిపై గంజాయి బ్యాచ్ దాడిలో బాధితుడు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.కర్రతో అతని మీద దాడికి పాల్పడినట్లు సమాచారం. దీనికి సంబంధించిన విజువల్స్ వైరల్ అవుతున్నాయి.