పేపర్ లీకేజీ తో యువత నష్టపోయారు : పవన్ కల్యాణ్

-

పేపర్ లీకేజీతో యువత నష్టపోయారని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు.గురువారం కొత్తగూడెంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. పేపర్ లీక్స్ తో ఎంతో మంది యువకులు నష్టపోయారన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రమే భూముల ధరలు పెరిగాయన్నారు. జిల్లాలో ఇంకా అభివృద్ధి జరగాల్సి ఉందన్నారు.

కౌలు రైతులని చులకనగా చూడొద్దన్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డితో తనకు పరిచయాలు ఉన్నాయని.. స్నేహం వేరు, రాజకీయాలు వేరు అన్నారు. గత పాలకులు చేసిన తప్పే తిరిగి తెలంగాణలో పునరావృత్తం అవుతోందన్నారు. కొత్తగూడెంలో జనసేన అభ్యర్థి లక్కినేని సురేందర్ ను గెలిపించాలని కోరారు. ఖమ్మం జిల్లాలో బీజేపీ, జనసేన అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో హైదరాబాద్ లో తప్ప ఎక్కడా అభివృద్ధి జరగలేదన్నారు. హైదరాబాద్ లో మాత్రమే మాత్రమే భూములు ధరలు పెరిగాయి. మిగతా జిల్లాల్లో ధరలు పడిపోయాయి. గత పాలకులు చేసిన తప్పులే పునరావృతం అవుతున్నాయి. కౌలు రైతులను బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదన్నారు. ధరణీ పోర్టల్ పూర్తిగా విఫలమైందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version