ప్ర‌పంచవ్యాప్తంగా యూట్యూబ్ సేవ‌ల‌కు అంత‌రాయం.. పున‌రుద్ధ‌రించిన గూగుల్‌..

-

సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్‌కు చెందిన యూట్యూబ్ సైట్ ప్ర‌పంచ వ్యాప్తంగా స్తంభించిపోయింది. చాలా స‌మ‌యం పాటు యూట్యూబ్ ప‌నిచేయ‌లేదు. కొన్ని చోట్ల గూగుల్ ప్లే స్టోర్ కూడా యాక్సెస్ అవ‌లేద‌ని యూజ‌ర్లు ఫిర్యాదులు చేశారు. డౌన్ డిటెక్ట‌ర్ అనే వెబ్‌సైట్ ఈ మేర‌కు వివ‌రాల‌ను వెల్ల‌డించింది.

భార‌త కాల‌మానం ప్ర‌కారం గురువారం ఉద‌యం 5.25 గంట‌ల స‌మ‌యంలో యూట్యూబ్ ప‌నిచేయ‌లేదు. డౌన్ డిటెక్ట‌ర్ సైట్‌లో 2.86 ల‌క్ష‌ల మంది యూట్యూబ్ ప‌నిచేయ‌డం లేద‌ని ఫిర్యాదు చేశారు. కాగా గూగుల్ వెంట‌నే స్పందించి స‌మ‌స్య‌ను చ‌క్క‌దిద్దింది. దీంతో యూట్యూబ్ మ‌ళ్లీ అందుబాటులోకి వ‌చ్చింది. అయితే యూట్యూబ్ ప‌నిచేయ‌ని స‌మ‌యంలో ఆ సైట్‌ను, యాప్‌ను ఓపెన్ చేసిన వారింద‌రికీ ఎర్రర్ మెసేజ్ లు ద‌ర్శ‌న‌మిచ్చాయి.

కాగా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించామని, యూట్యూబ్ ఇప్పుడు అన్ని డివైస్‌లు, బ్రౌజర్ల‌లో ప‌నిచేస్తుంద‌ని టీం యూట్యూబ్ ట్వీట్ చేసింది. అయితే ఈ విష‌యంపై సోష‌ల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. యూట్యూబ్ ప‌నిచేస్తుంద‌ని తెలియ‌క అన‌వ‌స‌రంగా ఇంటర్నెట్ రావ‌డం లేదేమోన‌ని అనుమానించామ‌ని, అందుక‌ని ఐఎస్‌పీలు, వైఫై రూట‌ర్ల‌కు సారీ చెబుతున్నామ‌ని నెటిజ‌న్లు ట్వీట్లు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version