ఆ ఊరంతా యూట్యూబర్సే..సందడిగా గ్రామం.. దండిగా ఆదాయం..!

-

ఈరోజుల్లో చాలామంది.. యూట్యూబ్‌ ఛానల్‌ పెట్టి మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. అయితే ఫాలోవర్స్‌ వచ్చిన తర్వాతే మన ఛానల్‌ గురించి జనాలకు తెలుస్తుంది.. ఆలోచన అందరికీ ఉన్నా.. అది ఆచరణలో కొందరే పెడతారు..దాన్ని చివరి వరకూ ఇంకొందరే తీసుకెళ్తారు.. ఛత్తీస్‌గఢ్‌లోని తుస్లీ గ్రామంలో యువతీ యువకులు ఇప్పుడు చేస్తున్నది అదే. కాలంతో పాటు వాళ్లూ అప్ డేట్ అయ్యారు. ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేయడం కంటే సొంతంగా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని యూట్యూబ్ ఛానల్స్ ప్రారంభించారు. ఒకరిద్దరు సక్సెస్ కాగానే.. ఊరిలోని యువకులంతా అదే బాట పట్టారు. ఇప్పుడు ఆ ఊరు యూట్యూబర్స్ హబ్‌గా మారింది. ఊర్లో ఎటూ చూసిన షూటింగ్స్‌ జరుగుతూ హడావిడిగా ఉంటుంది.

అలా మొదలైంది..

తుస్లీ గ్రామంలో యూట్యూబ్ సంస్కృతిని మొదలు పెట్టింది ఇద్దరు స్నేహితులు. ఒకరు జ్ఞానేంద్ర శుక్లా, మరొకరు జై వర్మ. వీరు రూపొందించిన కొన్ని వీడియోలు బాగా వైరల్‌ అయ్యాయి. నెటిజన్ల నుంచి వీరి వీడియోలకు రెస్పాన్స్‌ వచ్చింది. వారికి వచ్చిన ఆదరణతో మిగతా యువకులు సైతం యూట్యూబ్ చానెళ్లు ప్రారంభించారు. వారు కూడా బాగా సక్సెస్ అవడం విశేషం.

బ్యాంక్‌ ఉద్యోగం వదులుకోని మరీ..

జ్ఞానేంద్ర శుక్లా యూట్యూబూర్‌గా మారడానికి ముందు ఎస్‌బిఐ ఉద్యోగం చేసేవాడు. తనకు ముందు నుంచే సినిమాలంటే పిచ్చి..కాళీ సమయంలో ఎక్కువగా యూట్యూబ్‌లో వీడియోలే చూసేవాడట..చేసే ఉద్యోగం నచ్చలేదు..అంతే..జాబ్‌ మానేసి యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించారు. ఇప్పటి వరకూ దాదాపు 250 వీడియోలు చేశారట.. 1.15 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. ఇంతకుముందు యూట్యూబ్‌లో కంటెంట్‌ క్రియేట్ చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది పడేవాళ్లం. పబ్లిక్‌ ప్లేస్‌లో నటించలేకపోయాం.

టీచర్ ఉద్యోగాన్ని వదులుకున్న వర్మ

జై వర్మ తమ యూట్యూబ్ కెరీర్‌ కోసం ఉపాధ్యాయ వృత్తిని వదిలేశారు.. మమ్మల్ని చూసి యూట్యూబ్ కోసం, తర్వాత టిక్‌టాక్ కోసం, ఇప్పుడు రీల్స్ కోసం యువతీ యువకులు వీడియోలు చేయడం ప్రారంభించారు. నేను కెమిస్ట్రీలో MSc డిగ్రీ చేశాను. పార్ట్‌ టైమ్ టీచర్‌గా చేశాను.ఇంతకు ముందు నేను నెలకు రూ. 12,000-రూ. 15,000 సంపాదించాను. ఇప్పుడు మేము నెలకు రూ. 30,000-35,000 సంపాదిస్తున్నాం. తుస్లీ గ్రామంలో దాదాపు 3 వేల మంది ఉన్నారు. అందులో 40 శాతం మంది యూట్యూబ్‌కి కనెక్ట్ అయ్యారని జై వర్మ తెలిపారు.

బాలికలకు సాధికారత కల్పించే సాధనంగా యూట్యూబ్ మారిపోయింది. పింకీ సాహు అనే యూట్యూబర్ సైతం మంచి కంటెంట్ రూపొందిస్తూ సక్సెస్ ఫుల్‌గా చానెల్ రన్ చేస్తున్నది. యూట్యూబ్ ఛానల్‌ ప్రారంభించి 1.5 సంవత్సరాలకే దాదాపు 40 యూట్యూబ్ ఛానెల్‌లు మెయింటేన్‌ చేస్తుంది. ఇక్కడ మహిళలు సాధారణంగా ఇండ్ల నుంచి బయటకు రావడానికి అనుమతించరు. కానీ, మా యూట్యూబ్ ఛానెల్ ద్వారా అమ్మాయిలు కూడా ఏదైనా చేయగలరని నిరూపించామని పింకీ సాహూ అంటున్నారు.. అలా ఆ ఊరి ప్రజలకు యూట్యూబ్‌ పెద్ద వరంలా మారింది..

Read more RELATED
Recommended to you

Exit mobile version