ఐదు నెలల పాలనలో ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ముందుగా అభివృద్ధి కంటే పాలన పరంగా సంస్కరణల కోసమే శ్రీకారం చుట్టారు. ఇక ఇప్పుడిప్పుడే రాజకీయ పరమైన అంశాల్లోనూ దూకుడు చూపించేందుకు రెడీ అవుతున్నారు. ముందుగా ఏపీలో ప్రతిపక్ష టీడీపీపై కాన్‌సంట్రేషన్ చేసిన జగన్ ఎక్కడికక్కడ ఆ పార్టీ దూకుడుకు ముకుతాడు వేసేందుకు రెడీ అవుతున్నారు. టీడీపీ వాళ్లను బలవంతంగా తమ పార్టీలో చేర్చుకోవాలన్న ఆలోచన జగన్‌కు లేకపోయినా టీడీపీ నుంచి వైసీపీలో చేరే వాళ్లను మాత్రం పార్టీలో చేర్చుకుంటున్నారు. అదే టైంలో ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు వచ్చినా వారి పదవులకు రాజీనామా చేసి రావాలన్న కండీషన్లు కూడా పెడుతున్నారు.
ఇదిలా ఉంటే గన్నవరం ఎమ్మెల్యే వంశీ వైసీపీలోకి జంప్ చేసేందుకు రెడీగా ఉండగా ఇప్పటికే ఆయనకు సైతం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్న కండీషన్లు ఉన్నాయి. వైసీపీ రేపో మాపో వైసీపీలోకి వెళ్లినా ఆయన మాత్రం ఎమ్మెల్యే పదవి వదులుకోవాల్సిందే. ఇక ఇప్పుడు టీడీపీ చచ్చిన పాము. ఆ పార్టీ వైసీపీని చేసేదేం ఉండదు. ఇక ఇప్పుడు జగన్ ముందు బీజేపీ మెయిన్ టార్గెట్. కొద్ది రోజులుగా ఏపీలో బీజేపీ జగన్, వైసీపీని టార్గెట్‌గా చేసుకుని విమర్శలు పెంచుతోంది.
ఇప్పుడు అమరావతిలో బీజేపీ తోక కట్ చేయడమే జగన్ ముందున్న టార్గెట్. బీజేపీని తొక్కి ఉంచకపోతే ఆ పార్టీతో వైసీపీకి పెద్ద ప్రమాదం తప్పదు. మరోవైపు టీడీపీని బీజేపీ అడ్డంగా తొక్కేసి ఆ ప్లేస్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు నానా ప్రయత్నాలు చేస్తోంది. అయితే అదే టైంలో అటు హస్తినలో బీజేపీతో ఫ్రెండ్‌షిఫ్ కూడా చేయాలి. ఇందుకు జగన్ కేసీఆర్ సూత్రాన్ని ఫాలో అవుతున్నట్టే కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు కేసీఆర్ ఢిల్లీలో బీజేపీతో స్నేహం చేస్తూ ఇక్కడ తెలంగాణలో మాత్రం అడ్డంగా తొక్కేశారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్ల ఆ పార్టీకి కేవలం 2000 ఓట్లు కూడా రాని పరిస్థితి తెచ్చారు. పోయిన ఎన్నికల్లో బీజేపీ బలాన్ని ఐదు నుంచి ఒకటికి తగ్గించారు.
ఇప్పుడు జగన్ సైతం అదే సూత్రాన్ని ఫాలో అయ్యే ప్రయత్నాల్లో ఉన్నాడట. కేంద్రంతో దోస్తీ చేసి….అమరావతిలో మాత్రం బీజేపీకి చెక్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నారట. ఢిల్లీ వెళ్లినపుడు బీజేపీ నేతలు కలుస్తున్నారు. ఏపీకి రావాల్సిన అందాల్సిన సాయాన్ని అడుగుతున్నారు. ఈ క్రమంలోనే ఇక్కడ సుజనా బ్యాచ్‌కు చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారట. అందుకే వైసీపీ నుంచి బీజేపీ నేతలకు రిటాక్ట్‌లు కూడా పెరుగుతున్నాయి. మరీ తెలంగాణలో పనికొచ్చిన సిద్దాంతం ఏపీలో జగన్ విషయంలో ఏం జరుగుతుందో ? చూడాలి.