ప్రపంచంలో అత్యంత ఖరీదైన టాయిలెట్.. 40,815 వజ్రాలతో తయారీ.. దాని విలువ ఎంతో తెలుసా..?

-

జుట్టు ఉంటే ఎన్ని ముళ్ళు అయినా వేయవచ్చు… డబ్బులు ఉంటే ఎన్ని వేషాలు అయినా వేయవచ్చు… తాజాగా ఒక టాయిలెట్ నుంచి చూస్తే ఈ సామెతలు సరిగా నప్పుతాయనిపిస్తుంది. డబ్బున్న ఒక బంగారు దుకాణాల యజమాని బంగారం, వజ్రాలతో పొదిగిన ఒక టాయిలెట్ ని తయారు చేయించాడు. వివరాల్లోకి వెళితే… డైలీ మెయిల్ కథనం ఆధారంగా చూస్తే… హాంకాంగ్‌కు చెందిన ఆభరణాల బ్రాండ్ కొరోనెట్ ఒక ఆకర్షణీయమైన టాయిలెట్ ని తయారు చేసింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని దీనిని రూపొందించారు.

worlds most costly Gold toilet

334.68 క్యారెట్లు బరువు ఉన్న 40,815 వజ్రాలతో దీనిని తయారు చేసారు. అదే విధంగా దీనికి భారీగా బంగారాన్ని కూడా వాడారు. అంతే కాదు దీనికి మరో ప్రత్యేకత కూడా ఉంది… బుల్లెట్ ప్రూఫ్ సీటుతో దీనిని తయారు చేయడం విశేషం. అత్యధిక వజ్రాలు పొదిగిన బంగారపు వస్తువు కూడా ఇదే కావడం విశేషం. షాంఘైలో సోమవారం జరిగిన రెండవ చైనా అంతర్జాతీయ దిగుమతి ఎక్స్‌పో (సిఐఐఇ) లో స్వాన్కీ టాయిలెట్‌ను ఆవిష్కరించారు. ఈ బంగారు మరుగుదొడ్డి విలువ 1.3 మిలియన్ డాలర్లు కాగా భారత కరెన్సీలో అయితే… అక్షరాలా తొమ్మిది కోట్లు.

దీనిపై స్పందించిన కోరేనేట్ సంస్థ యజమాని ఆరోన్ షుమ్ ఇది కొనుగోలు దారులను ఆకర్షించిందో లేదో గాని… తాను మాత్రం దీనిని అమ్మడానికి సిద్దంగా లేనని స్పష్టం చేసాడు. “మేము డైమండ్ ఆర్ట్ మ్యూజియాన్ని నిర్మించాలనుకుంటున్నాము, తద్వారా ఎక్కువ మంది దీనిని ఆస్వాదించవచ్చు” అని ఆయన పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ గ్లామరస్ మరుగు దొడ్డి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై పలువురు పలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు వృధా చేయడం ఎందుకని కొందరు అంటే… దానిని వినియోగిస్తారా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version