దేశ రాజధాని ఢిల్లీతో పాటు దాని సమీప రాష్ట్రాల్లో కాలుష్య తీవ్రత ఇప్పుడు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో కూడా ఈ కాలుష్య తీవ్రత దారుణంగా దారుణంగా ఉంది. దీపావళి పండుగను ఈ నగరంలో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. దీనితో పొగ మంచుతో కాలుష్యం ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తుంది. కాలుష్యం దెబ్బకు అక్కడి ప్రజలు మాస్కులు లేకుండా బయటకు రావడం లేదు. ఇక అక్కడకు వెళ్తున్న భక్తులకు కాలుష్య౦ ఇక్కట్లు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి.
ఇక ఈ కాలుష్య బాధలు దేవుళ్ళకు కూడా తప్పడం లేదట. దీనితో అక్కడి భక్తులు దేవుళ్ళకు మాస్కులను తోడుగుతున్నారు. సిగ్రాలోని ప్రసిద్ధ శివ-పార్వతి ఆలయంలో, శివుడు, దుర్గాదేవి, కాళి దేవత మరియు సాయి బాబా ముఖాలు ముసుగులతో కప్పేసారు భక్తులు. ముఖాలను కప్పడం ద్వారా విషపూరిత గాలిని నివారించేందుకు దేవుళ్లకు భక్తులు సహాయం చేస్తున్నారు. దీనిపై స్పందించిన రాహుల్ అనే పూజారి…
మేము మా విగ్రహాలను సజీవ దేవతలుగా పరిగణిస్తాము మరియు వాటిని సంతోషంగా మరియు సౌకర్యవంతంగా చేయడానికి తాము కష్టపడతామని,వేసవిలో, విగ్రహాలను చల్లగా ఉంచడానికి చందనం పేస్ట్‌తో కరిగించి శీతాకాలంలో వాటిని ఉన్నితో కప్పేస్తా౦, కాలుష్యం నుండి వారిని కాపాడటానికి, తాము దేవుళ్ళ ముఖాలకు ముసుగులు ఉంచామని ఆయన వివరించారు. అయితే కాశీ దేవి ముఖాన్ని మాత్రం మాస్కులతో కప్పలేదు. దీనికి ప్రధాన కారణం ఆమె నాలుక బయటకు ఉండటమేనట. “ఆమె నాలుకను కప్పి ఉంచకూడదని నమ్ముతారు. కాబట్టి మేము ఆమె ముఖాన్ని కప్పి ఉంచకూడదని” ఆయన వివరించారు. ఏది ఎలా ఉన్నా మనుషులను కాపాడే దేవుళ్ళను భక్తులు కాపాడుతున్నారు.