2019 సార్వత్రిక ఎన్నికల్లో నగరి నుంచి రోజా గెలిచిన తర్వాత ఆమెకు మంత్రి పదవి ఖాయం అని అందరూ అనుకున్నారు. కానీ కాస్ట్ ఈక్వేషన్స్ కారణంగా ఆమెకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఆమెకు మంత్రి పదవితో సమానమైన ఏపీఐఐసీ చైర్మన్ పదవి కట్టబెట్టాడు ఏపీ సీఎం జగన్. రోజా కూడా సీఎం జగన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా కరోనా నేపథ్యంలో ఏపీలో షూటింగ్స్ కోసం ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక పాలసీ తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో సినీ రంగానికి సంబంధించి టాలీవుడ్‌లో మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్న రోజాను ఈ కమిటీ చీఫ్‌గా నియమించబోతున్నట్టు సమాచారం. ఇందుకోసం ఆమె కింద ఐఏఎస్ అధికారిని కూడా నియమించనున్నారు. ఎవరైనా టాలీవుడ్ దర్శక,నిర్మాతలు హీరోలు ఏపీలో ఏదైనా షూటింగ్స్ నిమిత్తం పర్మిషన్ కావాలంటే ప్రభుత్వం తరుపున ఆమె నేతృత్వంలో ఉన్న కమిటీకి విన్నవిస్తే సరిపోతుంది. ఆమె, ఐఏఎస్ అధికారి ద్వారా షూటింగ్స్‌కు అనుమతులు ఇచ్చేలా చేస్తోంది. మొత్తానికి ఆంధ్ర ప్రదేశ్ సినిమా షూటింగ్స్ బాధ్యతలు రోజా చేతుల్లో పెట్టడం నిజంగానే మంచి పరిణామం అంటున్నారు విశ్లేషకులు.