అధికార పార్టీ అన్నాక ఆధిపత్య పోరు సహజంగానే ఉంటుంది..అధికారం చెలాయించాలని ప్రతి నాయకుడు చూస్తారు..దీంతో ఒకరిపై ఒకరు ఆధిపత్యం చేయాలని చూస్తారు..ఈ క్రమంలోనే ఆధిపత్య పోరు పెరుగుతుంది. అయితే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో కూడా ఈ ఆధిపత్య పోరు ఎక్కువగానే ఉంది. అసలు వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చాలా నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు నడుస్తోంది. ఒకటి, రెండు అనుకుంటే పర్లేదు.. ప్రతి జిల్లాలో ఈ ఆధిపత్య పోరు జరుగుతుంది.
దీని వల్ల వైసీపీకి నష్టం..టీడీపీకి లాభం జరిగేలా ఉన్నాయి.. గతంలో అలాగే టీడీపీ అధికారంలో ఉండగా, ఆ పార్టీలో కూడా ఆధిపత్య పోరు ఎక్కువ జరిగేది..అసలు సొంత పార్టీ నేతల మధ్యే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్తితి ఉండేది. దీని వల్ల టీడీపీకి భారీ నష్టం జరిగింది. ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా నష్టపోయింది.
ఇప్పుడు వైసీపీలో కూడా అదే పరిస్తితి కనిపిస్తోంది..ఏదొక నియోజకవర్గంలో రచ్చ నడుస్తూనే ఉంది. ఉదాహరణకు నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్థర్, యువ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిలకు పడని పరిస్తితి. అటు కర్నూలు సిటీలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిల మధ్య రచ్చ నడుస్తోంది. ఇటు చిలకలూరిపేటలో ఎమ్మెల్యే విడదల రజిని, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మధ్య పోరు ఉంది.
తాడికొండలో ఎమ్మెల్యే శ్రీదేవి, ఎంపీ నందిగం సురేష్‌లకు పడటం లేదు. దర్శిలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలకు పడటం లేదు. అలాగే రాజమండ్రిలో ఎంపీ భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజాల మధ్య వార్ నడుస్తోంది. వీరే కాదు ఇంకా చాలామంది నేతల మధ్య రచ్చ నడుస్తోంది.
వైసీపీ పెద్దలు ఈ పోరుకు చెక్ పెట్టాలని చూసిన సాధ్యం కావడం లేదు..దీంతో జగన్ డైరక్ట్‌గా ఎంట్రీ ఇచ్చి ఈ పోరుకు చెక్ పెట్టనున్నారని తెలుస్తోంది. ప్రభుత్వంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టిన జగన్ పార్టీపై పెద్ద ఫోకస్ పెట్టలేదు. అయితే రాబోయే రోజుల్లో పార్టీపై కూడా ఫోకస్ పెట్టి పరిస్తితులని చక్కదిద్దాలని జగన్ చూస్తున్నారు. మరి చూడాలి జగన్ అయినా ఆధిపత్య పోరుకు చెక్ పెడతారేమో.