మెగాస్టార్ చిరంజీవి `సైరా` సినిమాతో ఫుల్ జోష్ మీద ఉన్నారు. కలెక్షన్స్ విషయంలో కూడా ఈ సినిమా రికార్డులను బద్దలు కొడుతోంది. అయితే ఇటీవల చిరంజీవి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అపాయింట్మెంట్ కోరారు. ఈ మేరకు సీఎంవో కార్యాలయం అపాయింట్మెంట్ ఖరారు చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం జగన్‌తో చిరంజీవి, రామ్ చరణ్ భేటీ అవుతారు. తాను కథానాయకుడిగా నటించిన చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ని వీక్షించడానికి రావాల్సిందిగా సీఎం జగన్‌ను చిరంజీవి కోరనున్నారు.
జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చిరంజీవి తొలిసారి ఆయనతో భేటీ కాబోతున్నారు. ‘సైరా’ సినిమాను వీక్షించాల్సిందిగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను చిరంజీవి ఇటీవల కోరడం, ఆమె కుటుంబంతో కలిసి సినిమా చూసి అద్భుతంగా ఉందంటూ ప్రశంచిన విషయం తెలిసిందే. ఈ చిత్రంపై సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తుండడం విశేషం.