151మంది ఎమ్మెల్యేలతో అత్యంత బలంగా.. బాబు ఇప్పట్లో కదిలించలేనంత దృఢంగా అధికారంలోకి వచ్చింది వైకాపా! అంతవరకూ అంతా హ్యాపీ… జగన్ సీఎం అయ్యారు… హ్యాపీ. అన్ని సామాజికవర్గాలకూ న్యాయం చేస్తూ మంత్రిపదవులు ఇచ్చారు… హ్యాపీ. సంక్షేమపథకాలు అద్భుతంగా అమలుపరుస్తున్నారు… హ్యాపీ. కరోనా విషయంలో దేశంమొత్తం ప్రశంసించేలా చర్యలు తీసుకుంటున్నారు… హ్యాపీ. ఇలాంటి సమయంలో అధికారపార్టీకి ఒక శాడ్ న్యూస్ ఇబ్బందిపెడుతుంది. అదేమిటంటే… టీడీపీ నుంచి వచ్చిన ముగ్గురు వ్యవహారం!
టీడీపీ నుంచి తాను ఇతర పార్టీల నుంచి చంద్రబాబులాగా ఎమ్మెల్యేలను చేర్చుకోనని.. తన పార్టీలో చేరాలంటే రాజీనామా చేసి రావాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో పార్టీకి అనఫిషియల్ గా మద్దతిచ్చేలా.. బాబుకు దూరంగా ఉండేలా ప్లాన్ చేసుకున్న వల్లభనేని వంశీ, మద్దాల గిరి, కరణం బలరాం లు జగన్ తో కలిసి చంద్రబాబును మానసికంగా దెబ్బకొట్టేలా వ్యవహరించారు. అయితే ఈ సందర్భంలో… ఆ మూడు నియోజకవర్గాల్లోనూ ఇప్పటికే ఉన్న ఇన్ ఛార్జ్ లతో ఇంటర్నల్ సమస్యలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి!
ఇందులో మొదటిగా గన్నవరం నియోజకవర్గం విషయానికొస్తే… అక్కడి నుంచి గెలిచిన వల్లభనేని వంశీ, టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీకి మద్దతిచ్చారు! అయితే వల్లభనేని వంశీని అక్కడి వైసీపీ నేత దుట్టా రామచంద్రరావు వ్యతిరేకిస్తూ.. గన్నవరంలో ఉప ఎన్నిక జరిగితే తనకే టిక్కెట్ ఇవ్వాలని అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు! ఫలితంగా క్యాడర్ ని కంఫ్యూజన్ లోకి నెట్టారు!
ఇక చీరాల నియోజకవర్గం విషయానికొస్తే… ఇక్కడనుంచి కరణం బలరాం వైకాపాకు అనధికారికంగా మద్దతిస్తోన్న తరుణంలో… మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గంతో పడక.. వైసీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జి పదవి కోసం రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటోంది!
ఇదే క్రమంలో… గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరి రాకతో కూడా అక్కడి వైకాపాలో కొత్తముసలం మొదలైంది. ఆయన రాకను కూడా ఇప్పటికే ఉన్న లీడర్లు స్వాగతించడం లేదు! ఫలితంగా అక్కడ కూడా వర్గ విభేదాలు స్టార్ట్ అయిపోయాయి!
పార్టీని మరింత బలోపేతం చేద్దామనే ఉద్దేశ్యంతో వీరి రాకను జగన్ ఆహ్వానిస్తే… స్థానిక నేతలు మాత్రం స్వాగతించడం లేదు! దీంతో… ఈ విషయంలో జగన్ జోక్యం అత్యవసరం అనే కామెంట్లు పెరిగిపోతున్నాయి. ఈ విషయంలో తాత్సారం చేసేకొద్దీ… వ్యవహారం చినికి చినికి గాలివానగా మారే పరిస్థితులు తలెత్తే ప్రమాధం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు!