వైసీపీ ఓడినా ఐ డోన్ట్ కేర్ అంటోన్న జ‌గ‌న్‌…!

-

రాష్ట్ర స‌మ‌గ్రాభివృద్ది కోణంలో నిర్ణ‌యాలు తీసుకుంటామ‌ని చెబుతున్న వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ చా లా వ్యూహాత్మ‌కంగా ముందుకు వెళ్తున్నార‌నే విష‌యం అర్ధ‌మ‌వుతోంది. ఆయ‌న రాష్ట్రంలో మూడు రాజధా నుల ప్ర‌క‌ట‌న చేసిన త‌ర్వాత గుంటూరులోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ వ్య‌తిరేక‌త స్ప‌ష్టంగా క‌నిపిస్తోం ది. దాదాపు ఐదు నుంచి ఆరు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇప్పుడు పుంజుకున్న పార్టీకి ప‌ట్టుమ‌ని ఏడు మాసాలు కూ డా తిర‌గ‌క‌ముందే తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త వ‌స్తోంది.

ఈ ప్ర‌భావం దాదాపు ఐదు నుంచి ఆరు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉంది. ఇంకా ఈ ఉద్య‌మాలు సాగితే.. గుంటూరు వ్యాప్తంగా కూడా వ్య‌తిరేక‌త వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అంటే, దాదాపు రెండు పార్ల‌మెంటుస్థానాలు, 15 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌లో వైసీపీ వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొ నే ప‌రిస్తితి వ‌చ్చింది. మ‌రి ఇక్క‌డ పార్టీ ప్ర‌భావం స‌న్న‌గిల్లితే న‌ష్ట‌మే క‌దా! అనే ఆలోచ‌న జ‌గ‌న్‌కు లేకుండా ఉంటుందా? అయితే, ఆయ‌న ఆలోచ‌న వేరేగా ఉంది. మ‌హా అయితే, పార్టీకి న‌ష్టం ఒక జిల్లాలోని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్ర‌మే ఉంటుంది.

 

కానీ, తాను తీసుకున్న మూడు రాజ‌ధానుల నిర్ణ‌యంతో అటు సీమ‌లోని నాలుగు జిల్లాలు స‌హా ఉత్త‌రాంధ్ర‌లోని విశాఖ‌, శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం వంటి మూడు జిల్లాల్లో శాశ్వ‌తంగా వైసీపీ జెండా ఎగిరేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. ఆయా ప్రాంతాల్లోని ఎస్సీ ఎస్టీ వ‌ర్గాల్లో ఒక్క‌సారి న‌మ్మ‌కం క‌లిగిస్తే.. ఇక, వారంతా జీవితాంతం పార్టీకి అండ‌గా ఉంటార‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు.

గ‌తంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువ‌చ్చిన వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కూడా గిరిజ‌న నియోజ‌క‌వ‌ర్గాలు, ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాల‌పై పెద్ద ఎత్తున వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ పునాదుల‌ను ప‌టిష్టంగా వేసుకున్నారు. ఇది చాలా వ‌ర‌కు కాంగ్రెస్‌కు మేలు చేసింది. నాయ‌కుల‌తో సం బంధం లేకుండా పార్టీకి ఓట్లే సే ప‌రిస్థితిని తీసుకువ‌చ్చారు.

ఇప్పుడు జ‌గ‌న్ కూడా ఒక జిల్లాలో పోయినా ఫ‌ర్వాలేదు.. అనుకునే వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి మూడు ప్రాంతాల్లోనూ అభివృద్ధి నినాదంతో రాజ‌కీ యంగా అడుగులు వేస్తున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఈ ప్ర‌యోగం స‌క్సెస్ అయితే, రాబోయే కొన్ని త‌రాల వ‌ర‌కు వైసీపీకి తిరుగు ఉండ‌ద‌ని జ‌గ‌న్ ప్ర‌గాఢంగా న‌మ్ముతున్నార‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version