సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జీ మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్స్, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిచారు. అయితే హీరో మహేష్ బాబు అభిమానులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ అదిరిపోయే గిఫ్ట్ అందించారు. సంక్రాంతి కానుకగా మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రానికి సంబంధించి రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో జనవరి 11 నుంచి 17 వరకు రెండు షోలు అదనంగా వేసుకునేందుకు అనుమతి ఇచ్చారు.
ఈ మేరకు ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వాలని చిత్ర నిర్మాత అనిల్ సుంకర ఏపీ సర్కారుకు లేఖ రాయగా స్పందించిన సర్కారు శుభవార్త చెప్పింది. ఈ నిర్ణయంతో పండుగ పూట సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు దక్కనున్నాయి. కాగా, సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 11న విడుదల కాబోతుంది. మరియు ఈ సినిమాలో లేడీ బాస్ విజయ శాంతి , రాజేంద్ర ప్రసాద్ , ప్రకాష్ రాజ్ లో ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు.