గుంటూరు పల్నాడు లో రాజకీయం రసవత్తరంగా మారింది. 2014 ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీ తరపున బీసీ నాయకుడు జంగా కృష్ణమూర్తి పోటీ చేసి ఓడిపోయారు. కానీ పల్నాడు నియోజకవర్గంలో మాత్రం పార్టీని నిలబెట్టడంలో బాగా కృషి చేశారు. కాగా గత ఏడాది 2019 ఎన్నికల సమయంలో వైసిపి పార్టీ అధ్యక్షుడు జగన్ ఆదేశాల మేరకు జంగా ఎమ్మెల్యే టికెట్‌ను త్యాగం చేసి యువ నాయకుడు, కాసు కృష్ణారెడ్డి వారసుడు మహేష్ రెడ్డికి అవకాశం కల్పించారు.
కాసు మహేష్ రెడ్డి… వైయస్ జగన్ కి బాల్యమిత్రుడు కావడంతో జంగా కృష్ణమూర్తి నియోజకవర్గంలో వైసిపి పార్టీ గెలవడానికి అన్ని విధాలా కాసు మహేష్ రెడ్డి తో కలసి అడుగులు వేశారు. దీంతో 2019 ఎన్నికల్లో గెలిచిన కాసు మహేష్ రెడ్డి తాజాగా తన గెలుపు కోసం దోహదపడిన జంగా కృష్ణమూర్తి వర్గంపై ఇగో ఫీలింగ్స్ పెట్టుకుని చుట్టుపక్కల వాళ్ల మాటలు వింటూ ఇటీవల నామినేటెడ్ పదవుల విషయంలో కూడా జంగా వర్గానికి ఎటువంటి పోస్టులు పదవులు రాకుండా కాసు మహేష్ రెడ్డి వ్యవహరించడం జరిగింది.
దీంతో చాలా సందర్భాల్లో ఓర్చు కున్న జంగా వర్గం నామినేటెడ్ పదవుల్లో కాసు వర్గం చేసిన అన్యాయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లారు. నువ్వు చెప్పిన అందుకే గత సార్వత్రిక ఎన్నికల్లో మా ఎమ్మెల్యే టికెట్ ని వదులుకొని కేవలం మీ స్నేహితుడు అవ్వడం తోనే కాసు మహేష్ రెడ్డి ని సపోర్ట్ చేయడం జరిగింది…ఇప్పుడు అతనే మా వర్గాన్ని అణచివేయాలని చూస్తున్నాడు అంటూ నామినేటెడ్ పదవుల విషయంలో జరిగిన అన్యాయాన్ని వివరించినట్లు వైసీపీ పార్టీలో టాక్. దీంతో కాసు వర్గం చేసిన అన్యాయం మొత్తం వైఎస్ జగన్ విని ఫుల్ సీరియస్ అయ్యారట. నియోజకవర్గం లో ఏం జరుగుతుందో వాళ్లపై కన్ను వేయమని జంగా అన్నకి ఏ మాత్రం అన్యాయం జరిగినా ఊరుకునే ప్రసక్తే లేదని పల్నాడు కు సంబంధించి కొన్ని బాధ్యతలను సీనియర్ నేతలకు జగన్ అందించినట్లు సమాచారం. ఇదే సమయంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో న్యాయం చేస్తానని జంగా వర్గానికి వైయస్ జగన్ హామీ ఇచ్చినట్లు వార్తలు వినబడుతున్నాయి.