ఆ జిల్లా మీద స్పెషల్ దృష్టి పెట్టిన జగన్ !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న జిల్లాలలో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉంది. దాదాపు 80 కి దగ్గరగా పాజిటివ్ కేసులు కర్నూలు జిల్లాలోనే నమోదు అయ్యాయి. దీంతో ఈ జిల్లాపై స్పెషల్ దృష్టిపెట్టారు జగన్. తాజాగా కర్నూలు జిల్లా లో వైరస్ వ్యాప్తి చెందుతున్న విషయం పై అధికారులతో జగన్ సమావేశం  అయ్యారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ అధికారులకు వైరస్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను హాట్ స్పాట్ గా గుర్తించి… ఆ ప్రాంతంలో ఒక్క మెడికల్ షాప్ మినహా మరే షాపు తెరువ కూడదని అధికారులకు సూచించారట.అంతేకాకుండా నిత్యావసర సరుకులు కూరగాయలను ఇళ్లకు అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారట. ముఖ్యంగా ఈ జిల్లా నుండి మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు మరో 40 మంది ఆచూకీ తెలియని దాన్ని విషయంపై గట్టి ఫోకస్ పెట్టాలని సూచించారట. కొంతమంది అడ్రస్ మరియు ఫోన్ నెంబర్లు తప్పుగా ఇచ్చి ప్రస్తుతం ఫోన్లు స్విచాఫ్ చేయడంతో ఏపీ అధికారులు వారిని గుర్తించడానికి నానా తిప్పలు పడుతున్నారు.

 

ఇదిలా ఉండగా సీఎం జగన్ ఆదేశాల మేరకు వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ఇప్పటికే అధికారులు రెడ్ జోన్ లుగా గుర్తించారు. హాట్ స్పాట్ లను గుర్తించి అక్కడ లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఇళ్లలో నుంచి ఎవరూ బయటకు రాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా నిత్యావసరాల సరుకులు, కూరగాయల విషయంలో జగన్ ఆదేశాల మేరకు ఇళ్లకు అందించే ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు. అంతేకాకుండా జిల్లాలో 15 క్వారంటైన్లను సిద్ధం చేశారు. నంద్యాల, కర్నూలు, కోడుమూరు ప్రాంతాల్లో క్వారంటైన్ లను ఏర్పాటు చేశారు. వీటిలో 1600 పడకలను సిద్ధం చేశారు. కేసులు నమోదు తీవ్రత ఎక్కువైనా ఇబ్బందులు పడకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎటువంటి క్లిష్ట పరిస్థితి వచ్చినా వైద్యపరంగా ఎక్కడా కూడా సమస్యలు లేకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version