ఏపీలో టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. అటు వంశీ కూడా దోబూచలాట ఆడుతూ గేమ్ టీడీపీ, వైసీపీ మధ్య రక్తికట్టిస్తున్నాడు. ముందుగా రెండు రోజుల్లో వంశీ జగన్, చంద్రబాబు, సుజనా చౌదరిని కలవడంతో ప్రారంభమైన ఈ ట్విస్టుల రాజకీయం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక ఈ వ్యవహారంలో వంశీకి అత్యంత సన్నిహితులు అయిన ఇద్దరు ఏపీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని జగన్ అపాయింట్‌మెంట్ తీసుకుని మరీ వంశీని జగన్ దగ్గర కూర్చోపెట్టారు.
టీడీపీ నుంచి వంశీ వచ్చి చేరతాడని… పార్టీ షరతులు అన్నింటికి ఒప్పుకుంటారని ఈ ఇద్దరు మంత్రులు వంశీని జగన్ ముందు ప్రవేశ పెట్టారు. అయితే వంశీ అంటేనే ఎవ్వరిని పూర్తిగా నమ్మే రకం కాదు. సొంత పార్టీకే చాలా చికాకు తెప్పిస్తుంటాడు. ఇది టీడీపీలో చాలా సార్లు ఫ్రూవ్ అయ్యింది. ఇక ఇప్పుడు టీడీపీకి రాజీనామా చేసే విషయంలో కాని… ఎమ్మెల్యే పదవిని వదులుకునే విషయంలో మాత్రం చాలా గేమ్ ఆడుతున్నట్టే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంకా చెప్పాలంటే వాట్సాప్ రాజీనామాలతో కామెడీ చేస్తున్నాడు. అసలు నిజంగా రాజీనామా చేయాలనుకుంటే స్పీకర్‌కు స్పీకర్ ఫార్మాట్లో పంపితే తాడోపేడో తేలిపోతుంది. స్పీకర్ పిలిచ వంశీ అభిప్రాయం అడిగి రాజీనామా ఆమోదిస్తే పనైపోతుంది. ఇక ఇప్పుడు అటూ టీడీపీని వీడాలా ? వైపీపీలోకి వెళ్లాలా ? అని నాన్చుతున్నాడు. మళ్లీ బాబుతో సయోధ్య అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. బాబును పొగుడుతూ లేఖలు రాస్తున్నాడు. ఇదంతా వైసీపీ వాళ్లకు కూడా చాలా చికాకుగా ఉంది.
ఈ వ్యవహారంలో ముందే వంశీని కరెక్టుగా ఒప్పించకుండా అతడిని గుడ్డిగా నమ్మేసి తన దగ్గరకు తీసుకు వచ్చిన వంశీ సన్నిహితుడు అయిన మంత్రి కొడాలి నానికి జగన్ ప్రత్యేకంగా క్లాస్ తీసుకోవడం కూడా జరిగినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. ఎందుకంటే జగన్ కూడా వంశీని నమ్మాడు… అందుకే వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావుకు అపాయింట్‌మెంట్ ఇవ్వని సీఎం వంశీకి ఏకంగా 45 నిమిషాల టైం ఇచ్చి అతడు చెప్పిందంతా విన్నాడు. ఇప్పుడు వంశీ డబుల్ గేమ్, నాన్చుడు వ్యవహారం జగన్‌కు కూడా నచ్చలేదంటున్నారు. అందుకే ఆ ఎఫెక్ట్ నానిపై పడినట్టు టాక్…?