కరోనా వైరస్ పేదవాడు ధనికుడు ప్రధాని అటెండర్ అనే భేదం లేకుండా దాని పని అది చేసుకుంటూ పోతోంది. ఈ వైరస్ వల్ల చాలా దేశ ప్రధాన లు మరియు అధ్యక్షులు సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లారు. తాజాగా ఇజ్రాయెల్ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అడ్వైజర్ కి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలడంతో బెంజమిన్ నెతన్యాహూ కూడా క్వారంటైన్ కు వెళ్లిపోయారు. ఇండియాలో కూడా ఇటువంటి పరిస్థితులే నెలకొంటున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా బావకి కరోనా పాజిటివ్ సోకినట్లు నమోదు అయ్యింది.
దీంతో వస్తున్న వార్తలను అంబటి రాంబాబు అలాగే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఖండిస్తున్నా గాని గుంటూరు జిల్లాలో కూడా వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఈ విషయంపై పార్టీ నాయకులతో జగన్ మాట్లాడగా..వచ్చిన వార్తలో వాస్తవం ఉంది అని తేలినట్లు సమాచారం. దీంతో జగన్ ఏమీ సందేహించకుండా మైండ్ లో సొంత వాళ్లు… పార్టీ కోసం బాగా పని చేసిన నాయకులు అయినా గాని అంబటి రాంబాబుని, ఆళ్ల రామకృష్ణారెడ్డి నీ సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాలని ఆదేశించినట్లు వైసీపీ పార్టీలో టాక్.