ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరం వద్ద ఉన్న ఆమె నివాసానికి భారీగా పోలీసు బలగాలు మోహరించి, ఉదయం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. షర్మిల ఉద్దండరాయునిపాలెం వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ అరెస్ట్ చోటుచేసుకుంది. త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ అమరావతిలో పర్యటించనున్న నేపథ్యంలో, శంకుస్థాపన చేసిన ప్రదేశానికి షర్మిల వెళ్లే యత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
అమరావతిలో జరుగుతున్న పరిస్థితులపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సభ్యులతో కలిసి షర్మిల ప్రాంతాన్ని సందర్శించి, మోదీని ప్రశ్నించాల్సిన అంశాలను అధ్యయనం చేయాలని భావించారు. అయితే మోదీ పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. దీంతో ఉద్దండరాయునిపాలెం వెళ్లే ప్రయత్నంలో షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.