ఈ దరిద్రం ఇక్కడితో చాలదు అని ఇక దేశానికి కావాలా : వైఎస్‌ షర్మిల

-

మహబూబ్‌నగర్‌ జిల్లాలో పాలమూరు-నీళ్లపోరు పేరిట వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల 24 గంటల నిరాహర దీక్ష చేపట్టింది. అయితే.. ఈ నిరాహార దీక్షను నేడు విరమించిన నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. నా మీద ఫిర్యాదు చేసేందుకు ఈ జిల్లా ఎమ్మెల్యేలు అంతా ఒకటయ్యారని టీఆర్‌ఎస్‌ నేతలపై విరుచుకుపడ్డారు. మరి ఈ జిల్లా సమస్యల కోసం ఎప్పుడైనా ఒకటయ్యారా అని ఆమె ప్రశ్నించారు. అంతేకాకుండా.. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ కోసం ఎప్పుడైనా అయ్యారా.. నా మీద పిర్యాదు చేసేందుకు చూపించిన ఐక్యత పాలమూరు ప్రాజెక్ట్ మీద చుపారా. ముఖ్యమంత్రి కేసీఅర్ దగ్గరకు వెళ్ళారా…అడిగారా. పాలమూరు ప్రాజెక్ట్ పూర్తి చేయనందుకు ఈ ఎమ్మెల్యేలు అంతా దద్దమ్మలు. కేసీఅర్ ను ఇక్కడ నుంచి వెళ్లగొడుతున్నారు. .అందుకే దేశం మీద పడుతున్నారు. దేశం ఈయనకు పిలిస్తుందట.
ఈ దరిద్రం ఇక్కడితో చాలదు అని ఇక దేశానికి కావాలా.

ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు… ఇక్కడే చేతకానొడు…ఇక దేశాన్ని బాగు చేస్తాడట. ఇక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే… పంజాబ్ రైతులకు సహాయం చేస్తారట. ప్రతి పక్షాలు బాగుంటే కేసీఅర్ ఇంత అరాచకం చేసి ఉండేవారు కాదు. బీజేపీ మత పిచ్చి పార్టీ…మతం పేరుతో సిచ్చు పెట్టీ చలి కాచుకునే పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే… ఆ ఎమ్మెల్యే లు వెంటనే టీఆర్‌ఎస్‌ సంకన ఎక్కుతున్నారు. బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణ …ఆత్మహత్యల తెలంగాణ గా మార్చారు. ఈ సారి కేసీఅర్ కి ఓటేస్తే మీ భవిష్యత్ మిమ్మలిని క్షమించదు. ఓటు తల్లి లాంటిది…చెల్లె లాంటిది. వైఎస్సార్ సంక్షేమ పాలన కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ. మాట మీద నిలబడే న్యాయ కత్వం కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ. వైఎస్సార్ సంక్షేమ పాలన కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ అని ఆమె వ్యాఖ్యానించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version