వైయస్ షర్మిల… తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టినప్పటి నుంచి చాలా చురుగ్గా పని చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే.. ప్రజల్లో తిరుగుతున్నారు. ఇందులో భాగంగానే టిఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టేందుకు వైయస్ షర్మిల పాదయాత్ర నిర్వహించారు. అయితే తాజాగా ఈ పాదయాత్రను పునః ప్రారంభించాలని వైయస్ షర్మిల నిర్ణయం తీసుకున్నారు.
ఇందులో భాగంగానే ఈ నెల 11 నుంచి వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర తిరిగి ప్రారంభించ నున్నారు. గత ఏడాది అక్టోబర్ 20న ప్రారంభం అయిన పాదయాత్ర… నవంబర్ 09న స్థానిక సంస్థల ఎన్నికలు, కరోనా ఉధృతి కారణంగా తాత్కాలిక వాయిదా పడింది. ఈ నెల 11న పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది.
ఇది ఇలా ఉండగా “నోటిఫికేషన్ల కోసం ఆత్మహత్యలు చేసుకొంటున్న వందల మంది నిరుద్యోగులను ఎందుకు ఆదుకోరు? అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్న వేలమంది రైతు కుటుంబాలను ఎందుకు ఆదుకోరు? కనీసం నష్టపోయిన పంటకు పరిహారం ఎందుకివ్వరు? సొంత రాష్ట్రం వారిని అల్లం,బయటి వారిని బెల్లం చేసుకోవడమేనా బంగారు భారత్ కు బాట” అంటూ కేసీఆర్ పై ఫైర్ అయ్యారు.