ఆ గుర్తు కోసం ఈసీకి వైఎస్సార్‌టీపీ దరఖాస్తు

-

తెలంగాణ ఎన్నికల్లో వైఎస్సార్టీపీ 119 నియోజక వర్గాల్లోనూ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రకటించారు. బీఫాంల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. షర్మిల అధ్యక్షతన ఇవాళ వైఎస్సార్టీపీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం సమావేశం జరిగింది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాను పాలేరు నుంచి పోటీ చేస్తానని షర్మిల చెప్పారు. తాను రెండు నియోజక వర్గాల్లో పోటీ చేయాలని డిమాండ్ ఉందని తెలిపారు.

బ్రదర్ అనిల్, విజయమ్మ కూడా పోటీ చేయాలన్ని డిమాండ్ ఉందని అన్నారు. అవసరమైతే వారిద్దరూ పోటీ చేస్తారని ప్రకటించారు. కాంగ్రెస్‌తో కలిసి వెళ్తే ప్రజా వ్యతిరేక ఓటు చీలదని అనుకున్నామని చెప్పారు. ఓట్లు చీల్చితే తమకు అపఖ్యాతి వస్తుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆలోచించామని తెలిపారు. ఓట్ల చీలకూడదని కాంగ్రెస్‌తో చర్చలు జరిపామని అన్నారు. నాలుగు నెలల పాటు ఎదురు చూశామని చెప్పారు. తెలంగాణలో మళ్లీ వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకు వస్తామని చెప్పుకొచ్చారు.

ఎన్నికల్లో పోటీ చేసేందుకు గుర్తు కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌టీపీ దరఖాస్తు చేసుకుంది. రైతు నాగలి కోసం కన్ఫామ్ చేయాలని ఈసీకి దరఖాస్తు పంపింది. ఎన్నికల్లో కొత్తగా పోటీ చేయబోయే పార్టీలకు త్వరలోనే ఈసీ గుర్తులను కేటాయించనుంది. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన ఈసీ.. ఎన్నికలకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. అధికారులను బదిలీ చేయడంతో పాటు వాహనాల తనిఖీలను కూడా షురూ చేసింది. నవంబర్‌లో తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించనుండగా.. అనంతరం కొత్తగా పోటీ చేసే పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఈసీ గుర్తులు కేటాయించనుంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తైన తర్వాత వైఎస్సార్‌టీపీకి గుర్తు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ సమయంలో వైఎస్సార్‌టీపీకి ఈసీ గుర్తు కేటాయించే అవకాశముందని తెలుస్తోంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version