కేసీఆర్ కు అంబేద్కర్‌ రాసిన రాజ్యంగం అందజేస్తా – షర్మిల

-

తెలంగాణ సీఎం కేసీఆర్ కు అంబేద్కర్‌ పుస్తకం అందజేస్తానని వైఎస్‌ షర్మిల అన్నారు. తెలంగాణ లో అంబెడ్కర్ రాజ్యాంగానికి గౌరవం ఇవ్వట్లేదని… సీఎం కేసీఆర్‌.. దళితులను మోసం చేశారని ఆగ్రహించారు. sc కార్పొరేషన్ లకు అప్లికేషను పెట్టుకున్నా డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని మండిపడ్డారు.

19 లక్షల మంది దళిత కుటుంబాలు ఉంటే కేవలం 32 వేల కుటుంబాలకె ఇచ్చారన్నారు. రాజ్యాంగం మార్చాలని అంబెడ్కర్ ను అవమానించారని కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి అని ఇప్పుడు పెద్ద విగ్రహం పెడుతున్నారు… కేసీఆర్ అంబెడ్కర్ రాసిన రాజ్యాంగం చదవలేదన్నారు. అందుకే కేసీఆర్ కు బహుమతి గా అంబేద్కర్‌ పుస్తకం ఇవ్వనోతున్నానన్నారు. అందుకే నేను నడుచుకుంటూ వెళ్లి కేసీఆర్ కు ఈ పుస్తకం ఇస్తానని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version