షర్మిల వర్సెస్ టీఆర్ఎస్..ఇదేం రచ్చ..!

-

ఎట్టకేలకు షర్మిల విమర్శలకు అధికార టీఆర్ఎస్ ఇప్పుడు గట్టిగా స్పందించడం మొదలుపెట్టింది. ఇప్పటివరకు షర్మిలని ఏ పార్టీ పెద్దగా పట్టించుకోలేదు. ముఖ్యంగా షర్మిల..పార్టీ పెట్టిన దగ్గర నుంచి టీఆర్ఎస్‌ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేత్సున్నారు. కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ప్రతిరోజూ ఏదొక అంశంపై ఆమె విమర్శలు గుప్పిస్తూనే ఉంది. అలాగే పాదయాత్ర చేస్తూ…ఎక్కడకక్కడ ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై, మంత్రులపై షర్మిల విమర్శలు చేస్తున్నారు.

ఆ మధ్య ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్ళి మంత్రి పువ్వాడ అజయ్‌పై ఫైర్ అయ్యారు..ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లాకు వెళ్ళి మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ముఖ్యంగా షర్మిల-నిరంజన్ రెడ్డిల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడిచింది. ఇక ఇప్పటివరకు షర్మిల విమర్శలని పట్టించుకోని నేతలు..తాజాగా షర్మిలపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. శాసన సభ్యులపై రాజకీయ నాయకులుగాని, ఇతర ప్రజాప్రతినిధులుగాని.. అసభ్య పదజాలంతో దూషించినా, అగౌరవపర్చినా.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డిని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కోరారు. షర్మిల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఫిర్యాదు చేశారు.

ఇదే క్రమంలో షర్మిల సైతం కౌంటర్ ఇచ్చారు.. తనను మరదలు అన్నారని… సంస్కార హీనుడైన మంత్రి నిరంజన్ రెడ్డి పై కఠిన చర్యలు తీసుకోవాలని షర్మిల స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే గతంలో కేసీఆర్…ప్రతిపక్ష నేతలని తిట్టిన తిట్లకు సంబంధించిన వీడియోలని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ…ఆయనపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇలా టీఆర్ఎస్-షర్మిల మధ్య తీవ్ర స్థాయిలో వార్ నడుస్తోంది. అయితే రాజకీయంగా షర్మిల విమర్శలకు ఎవరు పెద్దగా కౌంటర్ ఇవ్వడం లేదు. ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా స్పందిస్తున్నారు. దీంతో షర్మిలకు రాజకీయంగా హైలైట్ అయ్యే అవకాశం దక్కిందని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version