ధాన్యం కొనుగోలుపై డ్రామాలు ఢిల్లీకి చేరాయి.. కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై వైఎస్ షర్మిళ

-

తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు అంశం టీఆర్ఎస్, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుస్తున్నాయి. పంజాబ్ లో మరణించిన రైతులకు సీఎం కేసీఆర్ రూ. 3 లక్షల పరిహారం ఇస్తామని చెప్పడంతో.. తెలంగాణ లో మరణించిన రైతులకు పరిహారం ఏదని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. తాజాగా ఈ అంశాలపై వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ స్పందించారు. ట్విట్టర్ లో కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వ్యాఖ్యానించారు.

ఆమె ట్విట్లర్ లో స్పందిస్తూ.. ’ధాన్యం కొనుగోళ్లపై డ్రామాలు ఢిల్లీకి చేరాయి.. కానీ కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు నడిచేది లేదు. ధాన్యం కొనేది లేదు. అకాల వర్షాలకు పండిన పంట తడిసిపోయి మొలకలస్తుఉంటే, కష్టపడి పండించిన పంట కళ్ల ముందు కొట్టుకుపోతుంటే, మొలకలొచ్చిన నారు వేసుకోవాలో.. పారబోయాలో.. కొంటారో కొనరో తెలియక ధాన్యం కుప్పల మీదే రైతుల గుండెలు ఆగిపోయాయి. కానీ మీ గుండెలు మాత్రం కరగడం లేదు. ఉత్తరాదిలో చనిపోయిన రైతులకు లక్షల సాయం చేస్తున్న మీకు తెలంగాణ రైతు కష్టాలు కానోస్తలేవు. కొనుగోలు కేంద్రాల్లో రైతు కన్నీళ్లు ఆవిరి కాకముందే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మా డిమాండ్‘ అంటూ ట్విట్లర్ లో వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version