ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్. పోలింగ్ మోగియడంతో వైయస్సార్ చేయూత, విద్యా దీవన, ఆసరా అలాగే ఈ బీసీ నేస్తం లాంటి పథకాల డబ్బుల కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే అంటే ఈనెల 14 నుంచి డబ్బులు అకౌంట్లో వేసుకోవచ్చని ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చింది.
కానీ రెండు రోజులు గడిచిన ప్రభుత్వం 14 వేల కోట్ల నిధులను విడుదల చేయలేదు. జూన్ 4వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉన్న… విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ డబ్బులను సోమవారం నుంచి రిలీజ్ చేసేందుకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. అయితే ఈ మేరకు అన్ని చర్యలు తీసుకుంటోందట జగన్ సర్కార్.