ఏపీలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలకు నిధులను సమకూర్చలేక.. అనేక పథకాలపై జగన్ సర్కార్ కోతలు విధిస్తుంది. ఇప్పటికే అమ్మ ఒడి పథకం పై కోతలు పెట్టిన జగన్ మోహన్ రెడ్డి సర్కార్.. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.
వైఎస్ ఆర్ మత్స్యకార భరోసా పంపిణీలో ప్రభుత్వం కోతలేస్తోంది. వేరే పథకాలు అందుకుంటే.. మత్స్యకార భరోసా వర్తించందటూ అనేక మందికి ఆర్థిక సాయాన్ని నిలిపి వేశారు. గతంలో ఒక సారి పదివేలు అందుకున్న లబ్దిదారులు.. ఇప్పుడు నవరత్నాల్లో ఒక రత్నం రాలిపోయిందంటూ లబోదిబో అంటున్నారు.
గుంటూరు జిల్లాలో సగానికి సగం లబ్ది దారుల సంఖ్య తగ్గేలా ఉంది. మత్య కారుల ఇంట్లో ఎవరికైనా అమ్మ ఒడి అందుతున్నా.. 45 ఏళ్లకు పైబడిన మహిళలు పింఛన్ పొందుతున్నా.. వారికి వైఎస్‌ఆర్ మత్స్యకార భరోసా వర్తించదని అధికారులు నిబంధనలు పెట్టారు. అయితే.. కొత్త నిబంధనలపై మత్స్య కారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.