నేటి నుంచి వైఎస్‌ షర్మిల రైతు ఆవేదన యాత్ర

-

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల మరో పోరాటానికి సిద్ధమయ్యారు. రైతు ఆవేదన యాత్ర పేరుతో… నేటి నుంచి వైఎస్ షర్మిల పోరాటానికి సిద్ధం కానున్నారు. ఆదివారం లోటస్ పాండ్ లోని వైయస్సార్ టిపి కార్యాలయం నుంచి ఉదయం 10:30 గంటలకు ఈ రైతు ఆవేదన ను ప్రారంభించనున్నారు వైయస్ షర్మిల.

వైఎస్ ష‌ర్మిల‌ | Ys Sharmila

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు ఆత్మహత్యలు బాట పడుతున్న నేపథ్యంలో ఆవేదన షర్మిల రైతు ఆవేదన యాత్రను తలపెట్టారు. ఇవాల్టి నుంచి 23వ తేదీ వరకు ఈ యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో భాగంగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను వైయస్ షర్మిల పరామర్శించనున్నారు. అలాగే ఆయా కుటుంబాలకు పార్టీ తరఫున సహాయం కూడా అందజేయనున్నట్లు తెలుస్తోంది.

రైతు ఆవేదన యాత్ర మొదటి రోజు వివరాలు:

సంగారెడ్డి జిల్లాలోని ఆందోల్ నియోజకవర్గం, జోగిపేట్ మండలంలోని రైతు కుటుంబాన్ని వైయస్ షర్మిల గారు పరామర్శిస్తారు. అక్కడి మెదక్ జిల్లా నర్సాపుర్ నియోజకవర్గం, కౌడిపల్లి మండలం, కంచనపల్లికి వెళ్తారు. కంచనపల్లిలోని ఇద్దరు రైతుల కుటుంబాలను పరామర్శిస్తారు. ఆ తర్వాత కౌడిపల్లి మండలం, లింగంపల్లి గ్రామంలో మరొక రైతు కుటుంబాన్ని వైయస్ షర్మిల గారు కలిసి వారికి ధైర్యం చెప్పనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version