హుజూర్నగర్లో రాజకీయం రక్తి కడుతోంది. అసెంబ్లీ ఉప ఎన్నిక పోరు రోజురోజుకూ ఆసక్తికర మలుపు తి రుగుతోంది. టీఆర్ ఎస్, కాంగ్రెస్, బీజేపీ , టీ టీడీపీతోపాటు ఇంటి పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి బ రిలో దిగుతుండటంతో పోటీ రసవత్తరంగా మారింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిరేపుతున్న ఈ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం నేటితో ముగియనుండగా… సీన్‌లోకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంట్రీ ఇస్తుండటంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగిపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా హు జూర్‌నగర్‌లో పోటీకి రెడీ అయిందనే ప్రచారంతో రాజకీయం కొత్త మలుపు తిరిగింది.
హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో నువ్వా నేనా అన్నట్లుగా కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య పోరు న డుస్తుం ది. మధ్యలో బీజేపీ, టీడీపీ, సీపీఎం కూడా ఈ స్థానంపై కన్నేశాయి. తాజాగా హుజూర్‌నగర్ ఉప ఎన్నిక కో సం టీ టీడీపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. చావా కిరణ్మయిని పార్టీ తరుపున ఉప ఎన్నిక బరిలో నిలుపుతున్నట్టు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ.. ప్రకటించడమేగాక, ఆమెకు బీఫామ్ కూడా అం దజేశారు. అయితే టీడీపీ తమ అభ్యర్థిని ప్రకటించిన నేపథ్యంలో. .. వైసీపీ కూడా రంగంలోకి దిగ బోతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
జగన్ ఇంతవరకూ తెలంగాణలో పార్టీ నిర్మాణంపై దృష్టి సారించలేదు. ఆయన ఫోకస్ అంతా ఇప్పుడు ఏపీపైనే ఉంది. ఈనేపథ్యంలోనే ఇటీవల ఎన్నికల్లో ఆయన బంపర్ మెజార్టీతో విజయం సాధించారు. కా నీ ఆంధ్రాకు బోర్డర్‌లో ఉన్న ఖమ్మం, నల్గొండ జిల్లాలలో జగన్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక హు జుర్‌నగర్‌లో జగన్‌కు సంబంధించిన రెడ్డి సామాజిక వర్గ ఓట్ బ్యాంక్ కూడా బలంగా ఉంది. వారంతా మొదట్నుంచి కాంగ్రెస్ వైపే మొగ్గు చూపించేవారు. ఇక ఇక్కడ 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గట్టు శ్రీకాంత్‌రెడ్డి 27 వేల ఓట్లు తెచ్చుకున్నారు.
ఇప్పుడు జగన్ కనుక హుజూర్‌నగర్‌లో అభ్యర్థిని నిలబెడితే.. ఎంతో కొంత ఆ కమ్యునిటీ ఓటింగ్‌ను చీల్చే అవకాశం ఉంది. అందునా వైసీపీ పార్టీకి ఫేస్ అయిన మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి చరిష్మా కూడా కలిసి వ చ్చే అవకాశం ఉంది. దీంతో తమ బలాన్ని చూపించడంతో పాటు.. అటు కాంగ్రెస్‌కు చెక్ పెట్టి.. మి త్రుడైన సీఎం కేసీఆర్‌కు హెల్ప్ చేసే అవకాశం వైసీపీకి ఉంటుంది. దీంతో హుజూర్ నగర్ ఎన్నికలో ఇక్కడ అభ్యర్థిని నిలపాలా వద్దా అన్న జగన్ నిర్ణయం ఫలితాన్ని ప్రభావితం చేయనుందని కొందరు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక వేళ ఇక్కడ వైసీపీ అభ్యర్థిని రంగంలోకి దింపకపోయినా టీఆర్ఎస్‌కు సపోర్ట్ చేసేలా జగన్ నుంచ ఆదేశాలు అయినా వస్తాయంటున్నారు. నేటితో నామినేషన్ల పర్వానికి తెరపడనుండటంతో జగన్ ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.