ఎండలో నిలబడి జనాల లాక్ డౌన్ కష్టాలు మాయం చేస్తున్న వైకాపా లీడర్ ..

-

కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉంది. దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా చాలా కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. కేవలం నిత్యావసర సరుకులకు మాత్రమే ప్రజలు బయటకు వచ్చే విధంగా ప్రభుత్వాలు చొరవ తీసుకుంటున్నాయి. ఇటువంటి కీలక టైములో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలిచిన ఎమ్మెల్యేలు చాలామంది తమ తమ నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడింది. ఇదే విషయం ఇటీవల సీఎం జగన్ అధికారులతో మాట్లాడి గెలిచిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి అని ఆరా తీయగా చాలామంది నియోజకవర్గం వదిలి వేరే చోటికి వెళ్లిపోయినట్లు తేలింది. సేమ్ సీన్ చీరాల నియోజకవర్గంలో కూడా రిపీట్ అయినట్లు సమాచారం. ఇటీవల ఢిల్లీ నిజాముద్దీన్ దర్గా కి వెళ్లిన ప్రజలలో చీరాల పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు కూడా ఉన్నారు. దీంతో వైరస్ ఎక్కడా కూడా వ్యాప్తి చెందకుండా ఏపీ ప్రభుత్వం చాలా చర్యలు చేపడుతోంది. ఇటువంటి కీలకమైన టైములో చీరాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్న తరుణంలో గెలిచిన టిడిపి ఎమ్మెల్యే ఎక్కడ కూడా కనపడక పోవటంతో పాటు.. ఆయనతో ఏదైనా చర్చిద్దాం అన్న గాని అడ్రస్ కూడా ప్రస్తుతం ఎవరికీ తెలియడం లేదట. ఇటువంటి క్లిష్ట సమయంలో రాజకీయాలను గెలుపోటములను పక్కనపెట్టి ఆమంచి కృష్ణమోహన్ చీరాల నియోజకవర్గంలో ప్రజలను చైతన్య పరుస్తూ పర్యటించడం ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఆమంచి కృష్ణమోహన్ గత సార్వత్రిక ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. అయినా గాని ఎక్కడా కూడా చీరాల నియోజకవర్గానికి సంబంధించి రాజీపడకుండా ప్రతి సమస్యలో ముందు ఉంటూ ప్రజలకు భరోసా ఇస్తూ వస్తూ ఉన్నారు.
ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో నిత్యావసర సరుకులకు మరి కూరగాయలకు మాత్రమే వస్తుండటంతో…కొంతమంది దుకాణాదారులు ప్రజలను దోచుకోవడానికి అధిక ధరలతో అమ్మే పరిస్థితి నెలకొనటంతో పేద ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఆమంచి కృష్ణమోహన్ ప్రతి షాపు దగ్గరకు వెళ్లి ప్రభుత్వం నియమించిన బోర్డులు పెట్టాలని…ఎవరైనా సమస్యని క్యాష్ చేసుకోవాలని చూస్తే జైలుకు పంపించడం గ్యారెంటీ అని షాప్ యజమానులకు వార్నింగ్ ఇచ్చారు. షాపు బయట మార్కింగ్ ఉండేలా పెయింట్ తో మార్క్ చేయాలని…మార్కింగ్ లేకపోతే షాప్ క్లోజ్ అవుతుంది అని ఆమంచి కృష్ణమోహన్ మోహన్ తెలియజేశారు. తీవ్ర అవస్థలు పడుతున్న పేద ప్రజలకు సామాన్య ప్రజలకు భరోసా ఇస్తూ ఆమంచి కృష్ణమోహన్ చీరాల నియోజకవర్గంలో పర్యటించారు.ఇదే టైమ్ లో మెడికల్ షాపుల్లో కూడా ఎక్కువ ధరకు హ్యాండ్ వాష్ అమీనా గాని ఊరుకునే ప్రసక్తి లేదని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని పిలుపునిచ్చారు. గ్రామ వాలంటీర్లు పనితనం బాగుంది అని, మీ పై అధికారులు సరిగ్గా స్పందించకపోతే, ఎక్కడా కూడా ఎటువంటి అవసరం వచ్చినా 24 గంటలపాటు అందుబాటులో మీకు అందుబాటులో నేను ఉంటాను అంటూ ఆమంచి కృష్ణమోహన్ వాలంటీర్లకు తన ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఎండలో నిలబడి జనాల లాక్ డౌన్ కష్టాలను మాయం చేస్తూ పరిష్కారాన్ని చూపుతున్న ఆమంచి కృష్ణమోహన్ పై చీరాల నియోజకవర్గం ప్రజలు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.ఇదే టైములో వైయస్ జగన్ కూడా ఆమంచి కృష్ణమోహన్ చేస్తున్నా పనితీరును మెచ్చుకున్నారట. పార్టీ తరఫున ప్రజలకు అండగా నిలబడటంలో నిజమైన రాజకీయ నాయకుడు అనిపించుకున్నాడు అని, సరైన పొలిటిషన్ ఆమంచి అని పార్టీ నేతలతో జగన్ అన్నట్టు టాక్. అంతేకాకుండా గెలిచిన ఎమ్మెల్యేలు ప్రాణాలు దక్కించుకోవటానికి గెలిపించిన ప్రజలను పట్టించుకోని ఈ రోజుల్లో…ప్రాణాలను లెక్కచేయకుండా ఆమంచి చేస్తుంది చాలా గ్రేట్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమంచి చీరాల ప్రజలకు అండగా నిలబడుతున్న తీరుకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version