త్వరలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి… చేసుకోబోతున్నాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత. సినిమాకు ఓ హీరోయిన్ తో రెండు పాటలల్లో పిచ్చి గంతులేసినట్లు… నిజజీవితంలో కూడా మహిళలను వాడుకొని వదిలేసే నీచ సంస్కృతి పవన్ కళ్యాణ్ ది అని నిప్పులు చెరిగారు సునీత.
ముగ్గురిని పెళ్లి చేసుకుని, వదిలేసి, వారి జీవితాలతో చెలగాటం మారారని ఫైర్ అయ్యారు. శనివారం తాడేపల్లి లోని వైసిపి కేంద్ర కార్యాలయంలో సునీత మీడియాతో మాట్లాడుతూ…. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని పరిశీలిస్తే మహిళలకు ఆయన ఏమాత్రం గౌరవిస్తారో అర్థం అవుతుందన్నారు.
ఒకరు లోకల్, మరొకరు నేషనల్ లాగా ఇంకొక ఇంటర్నేషనల్ ఇప్పుడు ఇంకొకరితో పెళ్లికి రెడీ అయ్యారని పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగారు. దుశ్శాసనుడు అలాగే కీచకుడు మహిళల గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో… మహిళల రక్షణ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అలాగే ఉంటుందన్నారు. అసలు పవన్ కళ్యాణ్ దగ్గరే మహిళలకు రక్షణ లేదని చురక లాంటివారు సునీత.