కన్ ఫాం: టీడీపీ ఎమ్మెల్యేలను నుంచి వైకాపా ఎమ్మెల్యేలు నేర్చుకోవాలి!

-

అధికారంలోకి వచ్చిన కొత్తలో ఫుల్ హడావిడి చేసిన వైకాపా ఎమ్మెల్యేలు… ఏడాది గడిచిన అనంతరం చల్లబడ్డారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కారణాలు ఏమైనా కానీ… వారి ప్రవర్తనలో పూర్తి మార్పొచ్చిందని అంటూన్నారు. వారిలో కొందరు బహిరంగంగా ఆ చల్లబడటానికి గల కారణాలు పరోక్షంగా చెప్పే ప్రయత్నలు చేస్తుంటే… మరికొందరు మాత్రం గుమ్ముగా ఉంటున్నారు! ప్రస్తుతం వైకాపాకు శాపంగా మారుతుంది వీరి ప్రవర్తన!

అధికారంలోకి రావడం అంటే.. ఇక దున్నేసుకోవడమే అని భావించారో లేక ఆ నియోజకవర్గానికి అప్రకటిత రాజులమని ఫీలయ్యారో తెలియదు కానీ.. జగన్ ప్రభుత్వంలో ఆ ఆటలు సాగడం లేదని కొందరు ఎమ్మెల్యేలు సన్నిహితుల వద్ద చెబుతున్నారని తెలుస్తోంది. ఆ సంగతులు అలా ఉంటే… ప్రభుత్వ పథకాల పబ్లిసిటీ విషయంలో వైకాపా ఎమెల్యేలు పూర్తిగా విఫలమయ్యారనే కామెంట్లు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి!

జగన్ ముఖ్యమంత్రి అయినప్పటినుంచి అందిస్తోన్న సంక్షేమ పథకాలు మామూలు విషయం కాదు. కరోనా కష్టకాలం సంగతి కాసేపు పక్కన పెడితే… అలా ఆలోచించడం కూడా గొప్పవిషయమే. ఈ క్రమంలోనే తాజాగా వెలుగులోకి వచ్చిన పథకం… వైఎస్సార్ ఆస‌రా! దేశంలోనే తొలిసారి ల‌క్షల మంది ఎస్సీ, ఎస్టీ మ‌హిళ‌ల‌కు ఆర్ధికంగా ప్రోత్సాహాన్నిచ్చే ఈ పథకం గురించి ఎమ్మెల్యేలు… వారి వారి నియోజకవర్గాల్లో ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ… ఈ పథకం పై చాలా మంది వైకాపా ఎమ్మెల్యేలకు కనీస అవగాహన కూడా లేదంటే అతిశయోక్తి కాదేమో! ఈ ఒక్క పథకమే కాదు… జగన్ అందిస్తోన్న సంక్షేమ పథకాల విషయంలో మెజారిటీ ఎమ్మెల్యేల పరిస్థితి ఇదే అంటున్నారు!

గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పథకాలు జనాలకు ఎంత మేరకు అందాయన్న విషయం కాసేపు పక్కనపెడితే… వాటి పబ్లిసిటీ అనేది నియోజకవర్గ స్థాయిలో పీక్స్ లో ఉండేది. టీడీపీ ఎమ్మెల్యేలు వాటికి విపరీతమైన ప్రచారం కల్పించడంలో ఫుల్ మార్కులు కొట్టేసేవారు. కాకపోతే… మేటర్ నిల్ – పబ్లిసిటీ ఫుల్ వల్ల ఫలితాలు తారుమారయ్యాయి! వారి సంగతి అలా ఉంచితే… ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా.. ఆ పథకాలను ఆల్ మోస్ట్ అందరికీ అందేలా చూస్తున్న జగన్ ప్రభుత్వంలో… కనీస ప్రచారం కూడా వైకాపా నేతలు చేయకపోవడం దారుణమనే చెప్పాలి.

దీంతో… ఈ విషయంలో మాత్రం వైకాపా ఎమ్మెల్యేలు.. టీడీపీ ఎమ్మెల్యేలను చూసి నేర్చుకోవాలని పలువురు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version