సీఎంలతో మోదీ సమావేశం.. అన్ లాక్ 3పై చర్చ..! ఎప్పుడో తెలుసా..?

-

దేశంలో కరోనా వైరస్ సంక్రమణ నేపధ్యంలో లాక్ డౌన్ సిరీస్ తరువాత ఇప్పుడు అన్ లాక్ సిరీస్ చూస్తున్నాం. అన్ లాక్ 1 జూన్ 30తో ముగియడంతో.. అన్ లాక్ 2 మార్గదర్శకాలు జారీ అయ్యాయి. అయితే ఇది కూడా జులై 31 న ముగియనుండటంతో.. అన్ లాక్ 3 పై కేంద్రం కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కరోనా వైరస్ ప్రభావం, అన్ లాక్ 3.0 గురించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించే అవకాశాలు ఉన్నాయి.

అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఆరోగ్య సేవలు, వ్యుహాలపై ముఖ్యమంత్రులతో మోడీ చర్చించనున్నారు. అన్ లాక్ 2.0 తర్వాత పెరిగిన కరోనా కేసులు, దేశంలో అత్యధికంగా జరుగుతున్న కరోనా టెస్టుల వంటి అంశాలపై కూడా చర్చిస్తారు. కంటైన్మెంట్ జోన్లలో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ గడువు జూలై 31తో ముగుస్తుంది. ఈ క్రమంలో మరోసారి ముఖ్యమంత్రులతో చర్చించి కేంద్ర ప్రభుత్వం అన్ లాక్ 3.0 గైడ్ లైన్స్ రూపొందించనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version