ఇప్పుడు బయటకొచ్చింది ఉల్లిపాయపై పొర మాత్రమే.. ఐటీ దాడులపై విజయసాయిరెడ్డి వ్యాఖ్య‌లు

-

ఇటీవ‌ల కాలంలో ఐటీ దాడులు ఎక్కువ‌గా జ‌రుగుతున్న సంగ‌తి తెలిసింది. ముందుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ ల పై తర్వాత హీరోయిన్ల ఇళ్లపై కార్యాలయాలపై సోదాలు చేశారు ఐటీ అధికారులు. ఇక మొన్న‌టికి మొన్న‌ కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు విజయ్ ఇంటిపై మరియు కార్యాలయాలపై కూడా సోదాలు చేయడం జరిగింది. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ నాయకులపై జ‌రుగుతున్నాయి. అయితే తాజాగా ఏపీలో టీడీపీకి సంబంధించిన వ్యక్తులపై జరిగిన ఐటీ దాడులపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పీఎస్ ఇళ్లను సోదాలు చేస్తేనే వేల కోట్ల బ్లాక్ మనీ బయటపడిందని… బినామీలు, పెంచి పోషించిన కాంట్రాక్టు సంస్థలను జల్లెడ పడితే రూ. 10 లక్షల కోట్లయినా దొరుకుతాయని అన్నారు.

‘చంద్రబాబు నెట్ వర్క్ చూసి ముంబై కార్పొరేట్ సంస్థలన్నీ బిత్తరపోయాయట’ అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు బయటకొచ్చింది ఉల్లిపాయపై పొర మాత్రమేనని అన్నారు. చంద్రబాబు, ఆయన బానిస మీడియా ఇంతగా కుళ్లుకుంటున్నారంటే తిన్నది ఒంటబట్టడం లేదని అర్థమవుతోందని విజయసాయి దెప్పిపొడిచారు. కంటి నిండా నిద్ర పోవడం లేదని తెలిసిపోతోందని అన్నారు. దోపిడీ రోజులు పోయాయని… నిజాయతీ, విశ్వసనీయతల విలువేమిటో ప్రజలు గ్రహించారని చెప్పారు. పచ్చ తెరల లోకం నుంచి బయటకు రావాలని అన్నారు. మా కోడి కూస్తేనే తెల్లారుతుందనుకుంటే ఎలాగని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version