నారావారిపల్లెలో ఆదివారం వైసీపీ నిర్వహించిన బహిరంగసభ బెడిసికొట్టింది. నిన్న మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో వైసీపీ ప్రజాసదస్సు బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేశారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టిన పల్లె… నారావారిపల్లె. నారా వారిపల్లెతో పాటు చుట్టుపక్కల గ్రామాలన్నీ టీడీపీకి కంచుకోటలు. అటువంటి చోట సభ ఏర్పాటు చేస్తే టీడీపీ శ్రేణులు అడ్డుకుంటాయని పోలీసులు హైరానా పడ్డారు. అయితే నిన్న అక్కడంతా హైడ్రామా నెలకొంది.
అయితే టీడీపీ శ్రేణులు సంయమనంతో వ్యవహరించాయి. చివరికి నారావారిపల్లె గ్రామస్తులు కూడా ప్రశాంతతకు పేరుపడిన తమ ప్రాంతంలో ఉద్రిక్తతలు, గొడవలు సృష్టించడం తమకు ఇష్టం లేదంటూ మిన్నుకుండిపోయారు. మొత్తం మీద నారావారి పల్లెలో సభ పెట్టి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం పొందుదామని యత్నించిన వైసీపీ ప్లాన్ బెడిసికొట్టగా.. అడ్డుకోగలిగిన బలముండీ సంయమనం పాటించడం ద్వారా టీడీపీ శ్రేణులు జనం ప్రశంసలు అందుకున్నాయి. సభను విజయవంతం చేయడానికి వైసీపీ నేతలు శక్తిమేరా కష్టించారు. అయినా సగం మంది అతిథులు ప్రసంగించే సరికే సభ జనం లేక వెలవెలపోయింది.