వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్లర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు షర్మిళ. రైతుల మరణాలపై ఆమె స్పందించారు. కేసీఆర్ కు ఢిల్లీ కుర్చీనే కానీ.. రైతులపై ప్రేమ లేదని విమర్శించారు.
వైఎస్ షర్మిళ ట్విట్టర్ లో ఈ విధంగా వ్యాఖ్యానించారు. రైతులకు పనికి రాకున్నా, నిర్వాసితులు నిప్పంటించుకుని చచ్చినా.. మీ కమీషన్లకు ఢోకా రాకుండా.. లక్షల కోట్ల అప్పుతెచ్చి.. ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రాజెక్టు కట్టారని.. ఎత్తిపోసిన నీళ్లను సముద్రంలో ఎలా కలుపుతున్నారో చూపించే కేసీఆర్ గారికి, బంగారు తెలంగాణలో రైతులు బతకలేక చస్తున్నా పట్టించుకునే తీరికలేదని విమర్శించారు.