తాడేపల్లి : రేపు వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం అమలు కానుంది. సిఎం క్యాంపు కార్యాలయం నుంచి ఒక్కొక్కరి అకౌంట్లో రూ. 24 వేలు వేయనున్నారు ఏపి సిఎం వైఎస్ జగన్. 80,032 మంది లబ్ధిదారులకు 192.08 కోట్లు అకౌంట్లలో వేయనున్నారు సిఎం జగన్. మూడు విడుతలు కలుపుకుని ఇప్పటి వరకూ రూ. 576 కోట్లు అందించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.. ఒక్కొక్కరికి ఇప్పటి వరకూ 72 వేల రూపాయల లబ్ధి చేకూర్చింది.
ఐదేళ్లలో ఒక్కొక్క చేనేత కుటుంబానికి లక్షా ఇరవై వేలు ఆర్థిక సహాయం చేయనుంది ఏపీ ప్రభుత్వం. ఇక ఈ పథకం పొందాలంటే.. కార్మికులు స్థానికంగా చేనేత సంఘంలో రిజస్టర్ అయి ఉన్నారా? లేదా? అనే విషయం ముఖ్యమైనది. నేతన్న నేస్తం కింద సొంతం మగ్గం కలిగిన చేనేత కార్మిక కుటుంబాలకు ఏడాదికి రూ. 24 వేలు అందిస్తారు. సొంతంగా మగ్గాలున్న ప్రతీ కుటుంబానికి వైఎస్‌ఆర్ చేనేత నేస్తం పథకం అందుతుంది. కుటుంబానికి ఎన్ని మగ్గాలున్నా ఒక యూనిట్ గానే పరిగణిస్తారు. ఈ పథకంతో చేనేత కార్మికులకు ఎంతో ఉపయోగం కలుగునుంది.