నన్ను క్షమించండి..!

-

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఎట్టకేలకి క్షమాపణలు చెప్పాడు. ఇటీవల రోహిత్ శర్మతో ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో మాట్లాడుతూ, ‘భాంగి’ అనే పదం వాడాడు. వాస్తవానికి ఈ పదాన్ని టీమిండియా లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ను ఉద్దేశించి ప్రయోగించాడు. కానీ, ఇది ఓ కులాన్ని బాధించేలా ఉందని, తమ మనోభావాలు దెబ్బతిన్నాయని హర్యానాలో దళిత హక్కుల నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో యువరాజ్‌ని వెంటనే అరెస్ట్ చేయాలని కోరడంతో పాటు.. క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో యువీ స్పందించాడు. ఈ మేరకు ట్విట్టర్ లో లేఖ పోస్టు చేశాడు. తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చుకున్న యువరాజ్.. ఆ వ్యాఖ్యలతో ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరాడు. తాను ఎప్పుడూ అందరికీ గౌరవం ఇవ్వాలని భావించే వ్యక్తినని చెప్పుకొచ్చిన ఈ మాజీ ఆల్‌రౌండర్.. ఓ బాధ్యతాయుత పౌరుడిగా దేశం, ప్రజలపై ప్రేమ ఎప్పటికీ తగ్గదని స్పష్టం చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news