ప.గో జిల్లా… నేటి నుండి కరోనా ఉధృతి నేపథ్యంలో ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో ఆంక్షలు కొనసాగుతాయని… ఆలయ ఈవో వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. స్వామి దర్శనానికి వచ్చే భక్తులు మాస్కు ధరించి, శానిటైజర్ ఉపయోగించి, భౌతిక దూరం పాటించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. జలుబు, దగ్గు లాంటి అనారోగ్య సమస్యలు ఉన్న భక్తులకు దర్శనానికి అనుమతి లేదని తేల్చి చెప్పారు వైవీ సుబ్బా రెడ్డి.
గంటకు వెయ్యి మందికి మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తామని ఆయన క్లారిటీ ఇచ్చారు. 50 శాతం మాత్రమే అన్ని రకాల సేవా టికెట్లకు అనుమతి ఇస్తున్నామని చెప్పారు. కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో అంతరాలయ దర్శనం రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అలాగే… అన్న ప్రసాదం ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఉచిత ప్రసాదం, తీర్థము, శటారి నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ ఈవో వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.