సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కన్నా… ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇవాళ… సుప్రీంకోర్టు 51 వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ కన్నా ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇవాళ ఉదయం 10 గంటలకు ఉండనుంది. జస్టిస్ సంజీవ్ కన్నతో… రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించబోతున్నారు.
ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వచ్చే ఏడాది మే 13వ తేదీ వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా… జస్టిస్ సంజయ్ కన్నా కొనసాగుతారు. ఎన్నికల బాండ్లు, ఆర్టికల్ 370, ఈవీఎంలు లాంటి చాలా కేసులలో… జస్టిస్ సంజీవ్ కన్నా కీలక తీర్పులు ఇవ్వడంలో భాగస్వామ్యం అయ్యారు. అందుకే 51 వ ప్రధాన న్యాయమూర్తిగా… జస్టిస్ సంజీవ్ కన్నాకు అవకాశం కల్పించారు. ఇక 51 వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ కన్నా ప్రమాణస్వీకారానికి… దేశ ప్రధాని నరేంద్ర మోడీ తోపాటు అమిత్ షా లాంటి తదితరులు పాల్గొననున్నారు.