ఖేర్సన్ సిటీలో జెలెన్ స్కీ అకస్మీక పర్యటన

-

గత కొన్ని నెలలుగా ఉక్రెయిన్‌-రష్యాల నడుమ యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. రష్యా ఆక్రమించిన ఖేర్సన్ సిటీని తిరిగి స్వాధీనం చేసుకోవడం యుద్ధం ముగింపునకు సూచన అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ ప్రకటించారు. తమ సైనికుల ధైర్యసాహసాల వల్లే కీలకమైన నగరాన్ని తిరిగి దక్కించుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ విజయంతో రష్యాకు గుణపాఠం చెప్పారని తన సైనికులను మెచ్చుకున్నారు. సోమవారం అకస్మాత్తుగా ఖేర్సన్ నగరంలో పర్యటించి జెలెన్ స్కీ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇంతకాలం రష్యా సైన్యం అధీనంలో ఉన్న ఖేర్సన్ సిటీలో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ సహా పలు ప్రాంతాలను తనిఖీ చేశారు. ఆ తర్వాత సైనికులతో కలిసి జెలెన్ స్కీ జాతీయ గీతాన్ని ఆలపించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా, రష్యాను తక్కువ అంచనా వేయొద్దని జెలెన్ స్కీకి పలు దేశాలు సూచిస్తున్నాయి.

Ukraine's Zelensky Visits Newly Recaptured Kherson - WSJ

రష్యా సైనిక బలగాన్ని తేలిగ్గా తీసుకోవద్దని, ఖేర్సన్ నుంచి వెనక్కి మళ్లడంలో పుతిన్ ఆలోచనలను తక్కువగా అంచనా వేయొద్దని హెచ్చరించాయి. ఉక్రెయిన్ తో యుద్ధం మొదలైన తర్వాత రష్యా ఆక్రమించిన నాలుగు కీలక నగరాల్లో ఖేర్సన్ కూడా ఒకటి. ఉక్రెయిన్ కు చెందిన ఈ నగరాలలో రెఫరెండం నిర్వహించి రష్యా తన భూభాగంలో కలిపేసుకుంది. ఇకపై డోనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, జపరోజియా నగరాలు రష్యావేనని ప్రకటించింది. ఆ నగరాలపై దాడి చేస్తే రష్యా భూభాగంపై దాడిగానే పరిగణించి ప్రతిదాడులకు దిగుతామని ఉక్రెయిన్ ను హెచ్చరించింది. అయితే, ఈ నగరాలను కాపాడుకోవడం రష్యాకు అసాధ్యంగా మారింది. దీంతో కిందటి శుక్రవారం (ఈ నెల 11న) ఖేర్సన్ నుంచి తన బలగాలను ఉపసంహరించుకుంది. రష్యన్లు ఖాళీ చేసిన తర్వాత ఖేర్సన్ ను తిరిగి ఉక్రెయిన్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version