ఏపీ వాసులకు గుడ్‌న్యూస్‌.. రేపు లబ్దిదారుల ఖాతాల్లో నగదు

-

వైఎస్సార్ సున్నావడ్డీ వరుసగా నాలుగో ఏడాది లబ్దిదారులకు అందజేయనున్నారు సీఎ జగన్‌. రాష్ట్రవ్యాప్తంగా అర్హత గల 9.48 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 1,05, 13, 365 మంది మహిళలకు లబ్ది చేకూరనుంది. బ్యాంకులకు చెల్లించిన రూ. .1,353.76 కోట్ల వడ్డీని రీయింబర్స్ చేయనున్నారు సీఎం జగన్. లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో రేపు వర్చువల్ గా సీఎం జగన్ జమ చేయనున్న. సున్నా వడ్డీ నిధుల విడుదలకు సంబంధించిన విషయాన్ని స్వయంగా సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి జులై 26న ఈ కార్యక్రమం జరగాల్సి ఉంది.. కానీ ఈ కార్యక్రమం వర్షాల కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.

పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకుల్లో ఉన్న అప్పును.. అది కూడా గత అసెంబ్లీ ఎన్నికల నాటికి ఉన్న రుణాలకు సంబంధించి వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తోంది. సకాలంలో రుణాలు చెల్లించే డ్వాక్రా మహిళలకు ఇప్పటి వరకు వైఎస్సార్‌ సున్నావడ్డీ కింద రూ.4,969.05 కోట్లు చెల్లించారు. డ్వాక్రా సంఘాల మహిళలకు రుణాలపై 9 శాతం వడ్డీ వర్తింపజేసేలా బ్యాంకర్ల సమావేశంలో ఒత్తిడి తెచ్చి చర్యలు కూడా చేపట్టింది జగన్ సర్కార్. స్వయం సహాయక సంఘాలలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాలకు వడ్డీని ప్రభుత్వం భరిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version