ప్రస్తుతం.. చాలామంది స్విగ్గి, జొమాటో లను యూస్ చేసుకుని… తమ ఆకలి తీర్చుకుంటున్నారు. అయితే హైదరాబాద్ లో జొమాటో, స్విగ్గి వాడకం చాలా ఎక్కువ. జొమాటో ప్రతి ఆర్డర్ విలువ పై 18 నుంచి 25 శాతం మధ్య కమిషన్ రెస్టారెంట్ నుంచి వసూలు చేస్తోంది. స్విగ్గి కమిషన్ 18-23 మధ్య ఉంటుంది. ఈదర పై 5 శాతం జీఎస్టీ అదనం అలాగే డెలివరీ చార్జీలు కూడా ఉంటాయి. సాధారణంగా రెండు కిలోమీటర్ల దూరానికి నలభై నుంచి యాభై మధ్య ఛార్జ్ చేస్తున్నాయి.
దూరం పెరిగితే 60 రూపాయల వరకు డెలివరీ చార్జెస్ పడతాయి. ఆఫర్ల పేరుతో ఈ ప్లాట్ ఫామ్ లు కొంత డిస్కౌంట్ ఇస్తుండటంతో కమిషన్, డెలివరీ ఛార్జీల భారం పెద్దగా కస్టమర్ పై పడటం లేదు. కానీ ఈ రెండు సంస్థలు మార్కెట్ ను విస్తరించుకునే నేపథ్యంలో తాయిలాలు ఇస్తున్నాయి. ఒకసారి ఈ కార్యక్రమం ఒక స్థాయి చేరుకుంటే డిస్కౌంట్లు ఎత్తివేయడం లేదా నామమాత్రంగా ఆఫర్ చేయడానికి మారిపోతాయి. అయితే వినియోగదారులు ఎక్కువగా కావడంతో… డెలివరీ చార్జీలు పెంచే యోచనలో రెండు సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.