ఏపీలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగునున్న తరుణంలో జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ మేనిఫెస్టో ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈరోజు ఓటర్ల దినోత్సవమని.. ఓటు ప్రాధాన్యతను తెలిపే రోజని , అందుకే ఈరోజు జై భారత్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేశామన్నారు.కాగా.. ఏపీ రాజకీయాల్లో కొత్త పార్టీ ఆవిర్భవించిన విషయం తెలిసిందే.
వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు జేడీ లక్ష్మీనారాయణ సిద్ధమవుతున్నారు. అయితే.. అన్నదాత లేకుంటే మనం లేమని…అన్నదాతలను ఆదుకోవాలన్నారు. రైతుల ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ ని మార్చాలని లక్ష్మీనారాయణ అన్నారు.ఈ మేరకు మేనిఫెస్టోలో ముఖ్యంగా రైతులు, నిరుద్యోగుల కోసం పలు హామీలు ఇచ్చారు. వీటిని పక్కాగా అమలు చేస్తామన్నారు. ఈ మ్యానిఫెస్టోను ఆయా వర్గాలతోనే విడుదల చేయించడమే కాకుండా దీనికి పీపుల్స్ మ్యానిఫెస్టోగా వీవీ లక్ష్మీనారాయణ నామకరణం చేశారు.