ఖైరతాబాద్ గణపతి శోభాయాత్ర కన్నులపండువగా సాగుతోంది. ఆదివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్రను ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో, సందర్శకులతో శోభాయాత్ర ప్రాంతం అంతా జనసంద్రంగా మారింది. మరికొద్ది సేపట్లో లంభోదరుడు నిమజ్జనం కానున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రత నడుమ శోభాయాత్రను నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో ఇప్పటికే ఉన్న 2.50 లక్షల కెమెరాలతోపాటు నిమజ్జనం కోసం హుస్సేన్‌సాగర్, ఇతర చెరువుల వద్ద ప్రత్యేకంగా శక్తివంతమైన 450 కెమేరాలను ఏర్పాటు చేసినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి వివరించారు. నల్గొండ, నిజామాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఏర్పాటు చేసిన దాదాపు 1500 సీసీ కెమెరాలను కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేశారు. ఒకేసారి. సీసీ కెమెరాల ద్వారా గమనిస్తూ క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేయనున్నారు.