శబరిమల పరిసరాల్లో భారీ భద్రత…
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం మకరవిలక్కు పూజల ద్వారాలు తెరుచుకోనున్నాయి. సుప్రీం తీర్పు నేపథ్యంలో గతనెల మాసపూజల సందర్భంగా ఆలయంలోకి వెళ్లేందుకు మహిళలు యత్నించడంతో శబరిమ రణరంగంగా మారిన విషయం తెలిసిందే. నేడు ఆలయ ద్వారాలు తెరుచుకోనున్న నేపథ్యంలో శబరిమల పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో స్థానిక జిల్లా కలెక్టర్ ఆదేశాలతో శనివారం అర్ధరాత్రి నుంచే ఇక్కడ 144 సెక్షన్ విధించారు. ఎలవున్కల్, నీలక్కల్, పంబ, సన్నిధానం తదితర ప్రాంతాల్లో నలుగురు అంతకంటే ఎక్కువ మంది ఒకే చోట గుమిగూడరాదని స్పష్టం చేశారు. కొండపైకి వెళ్తున్న వాహనాలను తనిఖీలు చేసి పంపిస్తున్నారు.
ఇప్పటివరకు మహిళలు ఎవరూ తమను సంప్రదించలేదని, ఆలయంలోకి వెళ్లడానికి నిర్ణయించుకుంటే తప్పక భద్రత కల్పించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అమలుపరిచేలా చూస్తామని పోలీసులు హామీ ఇస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ సంఖ్యలో పోలీసులు మెహరించారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఇప్పటికే అయ్యప్ప దర్శనానికి రాజకీయ రంగు పులుముకుంటోంది అంటూ పలువురు భక్తులు, సామాన్యుల విశ్లేషణ చేస్తున్నారు.