హృతిక్ రోషన్  ‘ఫైటర్’ సినిమా  అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్.!

-

గత ఏడాది దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్  దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా వ‌చ్చిన ‘పఠాన్’ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్  సొంతం చేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ హీరోగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఫైటర్. ఈ  చిత్రం లో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుంది.అనిల్ కపూర్ కరణ్ సింగ్ గ్రోవర్‌, అక్షయ్‌ ఒబెరాయ్‌, సంజీదా షేఖ్‌, తలత్‌ అజిజ్  తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. జనవరి 25 న రిప‌బ్లిక్ డే సంద‌ర్బంగా  వరల్డ్ వైడ్ గా విడుద‌ల కానుంది.  ఇప్ప‌టికే ఈ చిత్రం  నుంచి వచ్చిన టీజ‌ర్‌తో పాటు ట్రైల‌ర్‌  ప్రేక్ష‌కుల నుంచి మంచి  స్పదన   వచ్చింది.ఇక రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్ వేగం పెంచారు.

 

ఇదిలావుంటే ….మేక‌ర్స్ మూవీ నుంచి సాలిడ్ అప్‌డేట్‌ను ఇచ్చారు. ‘ఫైటర్’ అడ్వాన్స్ బుకింగ్స్  ఈరోజు ఉద‌యం నుంచి స్టార్ట్ అయ్యిన‌ట్లు  సోష‌ల్ మీడియా వేదికగా చిత్ర బృందం వెల్లడించారు. ఇక ఈ  మూవీ  చూసేందుకు ఆడియెన్స్, ఫ్యాన్స్ ఎగబడుతుండ‌గా.. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే పెద్ద మొత్తంలో వసూళ్లు వస్తాయని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news