జూన్ 6 రాశి ఫలాలు: గురు గ్రహానికి కందుల నైవేద్యం పెడితే ఈరాశులకు ధనలాభం!

-

జూన్ 6 గురువారం – రోజువారి రాశి ఫలాలు

మేషరాశి: మిశ్రమ ఫలితాలు, ప్రయాణాలు తప్పనిసరి కాకుంటే వాయిదా వేసుకోండి, పిల్లలతో ఎక్కువ సమయం గడపండి, ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం కాదు, భాగస్వామితో ఇబ్బందులు. ఆర్థికంగా బాగుంటుంది. కుటుంబ సఖ్యత.
పరిహారాలు: రాగి లేదా బంగారు గాజు ధరించండి మంచి జరుగుతుంది.

వృషభరాశి: వృత్తిలో సంతృప్తి, ప్రేమ విషయాల్లో ప్రతికూలత, ఆర్థికంగా ఇబ్బంది, కుటుంబంలో స్వల్ప ఇబ్బంది, ఆరోగ్యం జాగ్రత్త. భాగస్వామితో ఓర్పుతో వ్యవహరించండి.
పరిహారాలు: నీలి రంగు దుస్తులను ధరించండి, నవగ్రహాలకు ప్రదక్షణ చేయండి.

మిథునరాశి: ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థికంగా అనుకూలం, కుటుంబంలో ఇబ్బంది, ప్రేమ విషయాలు ప్రతికూలం, వృత్తిలో సాధారణంగా ఉంటుంది, భాగస్వామితో స్వల్ప ఘర్షణ వాతావరణం.
పరిహారాలు: పాలు, మిశ్రి (స్పటికం), తెల్ల గులాబీలను నవగ్రహాలు లేదా దేవాలయంలో నైవేద్యంగా సమర్పించండి మంచి జరుగుతుంది.

కర్కాటకరాశి: అధిక ఖర్చులు, ఆరోగ్యం బాగుంటుంది, కుటుంబంలో సంతోషం, ప్రేమ విషయాలు అనుకూలం, వృత్తిలో ఇబ్బంది, భాగస్వామితో ఆనందం.
పరిహారాలు: ఆర్థిక ఇబ్బందులు పోవడానికి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించండి.

సింహరాశి: ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థికంగా ఇబ్బందులు, పగటి కలలు కనకండి, పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి, కుటుంబంలో సంతోషం, భాగస్వామితో ఆనందం.
పరిహారాలు: గురుగ్రహం దగ్గర కందులను నైవేద్యంగా సమర్పించండి. ధనలాభం కలుగుతుంది.

కన్యారాశి: భాగస్వామితో సంతోషంగా గడుపుతారు, ఆర్థికంగా పర్వాలేదు, కుటుంబంలో శుభకార్యాలు, సంతోషం, ఆరోగ్యం బాగుంటుంది, ప్రేమ విషయాలు అనుకూలిస్తాయి, పనిచేసేచోట జాగ్రత్తగా ఉండాలి.
పరిహారాలు: పనిచేసే చోట అనుకూలత కోసం తక్కువగా మాట్లడటం, గురుగ్రహానికి పిడికెడు కందులు నైవేద్యం సమర్పిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

తులారాశి: ఆర్థికంగా బాగుంటుంది, ఆరోగ్య విషయలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం, వృత్తి అంటే పనిచేసేచోట సాధారణంగా ఉంటుంది, ప్రేమ విషయాలు అత్యంత అనుకూలం, భాగస్వామితో సంతోషం.
పరిహారాలు: ప్రవహించే నదిలో నాణేలను వదలండి/దేవాలయంలో హుండీలో వేయండి.

వృశ్చికరాశి: ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, కుటుంబంలో సంతోషం, ప్రేమికులకు అనుకూలం, పనిచేసే చోట అనుకూలం, వివాహితులకు సంతోష జీవనం, ఆర్థికంగా బాగుంటుంది.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, దైవనామస్మరణ సరిపోతుంది.

ధనస్సురాశి: ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థికంగా మంచి సమయం, కుటుంబ సంతోషం, వృత్తిలో అనుకూలత, భాగస్వామితో జాగ్రత్తగా మాట్లాడండి, వివాదాలకు దూరంగా ఉండాలి.
పరిహారాలు: గురుగ్రహం దగ్గర పిడికెడు కందులను నైవేద్యంగా సమర్పిచండి.

మకరరాశి: ఆరోగ్య విషయంలో జాగ్రత్త, బాకీలు వసూలు, ఆర్థికంగా బాగుంటుంది, పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి, కోపతాపాలకు దూరంగా ఉండాలి.
పరిహారాలు: గురుగ్రహానికి కందులను నైవేద్యంగా సమర్పించాలి.

కుంభరాశి: అనారోగ్య సమస్యల నుంచి విముక్తి, భాగస్వామితో సంతోషం, ఆర్థికంగా పర్వాలేదు, ప్రేమ విషయాలు సానుకూలం, వృత్తిలో ఏమరపాటు పనికిరాదు.
పరిహారాలు: నవగ్రహాలకు ప్రదక్షణలు, దీపారాధన చేయండి.

మీనరాశి: వృత్తిలో అనుకూలత, భాగస్వామితో సంతోషం, ఆనందం, పనులు పూర్తి, కుటుంబంలో స్వల్ప ఇబ్బందులు, ఆర్థికంగా ఇబ్బంది, ఆరోగ్యం బాగుంటుంది.
పరిహారాలు: సంపద పెరుగుదల కోసం సూర్యోదయ సమయంలో ఓం అని 11 సార్లు స్మరించండి

నోట్: కందులు నైవేద్యం అంటే పిడికెడు శుభ్రమైన కందులను ఒక బౌల్ లేదా కవర్‌లో పెట్టి గురుగ్రహం దగ్గర పెట్టి నైవేద్యంగా సమర్పించాలి. వాటిని అక్కడే వదిలి రావాలి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version