మార్చి 3 ఆదివారం- రోజువారి రాశిఫలాలు

-

నల్లమేకకు అరటిపండు తినిపిస్తే ఈరాశివారికి మంచి జరుగుతుంది!

మేషరాశి- అనుకూల ఫలితాలు, లాభం, కుటుంబంలో సంతోషం, సౌఖ్యం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, వేంకటేశ్వరస్వామి ధ్యానం మంచి చేస్తుంది.

వృషభరాశి- మిశ్రమం. బాకీలు వసూలు, వ్యాపారలాభం, విందులు, విరోధాలు, మిత్రులతో కలహం.
పరిహారాలు: సూర్యరాధన, గోసేవ, పేదలకు సహాయం చేయండి విశేష ఫలితాలు వస్తాయి.

మిథునరాశి- మిశ్రమం. శుభకార్యమూలకంగా ధనవ్యయం, బంధువుల కలయిక, పనుల్లో జాప్యం.
పరిహారాలు: సూర్యారాధన, గోసేవ, నల్లమేకకు అరటిపండు తినిపించండి మంచి జరుగుతుంది.

కర్కాటకరాశి- అనుకూల ఫలితాలు, కార్యజయం, ధనలాభం, విందులు.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, అన్నదానానికి సహయం చేయడం చేయండి.

సింహరాశి- అనుకూలం. మనఃశాంతి, కళత్ర సుఖం, సోదరవర్గ సహాయం, జయం.
పరిహారాలు: సూర్యనమస్కారాలు, అన్నదానం చేయండి మంచి జరుగుతుంది.

కన్యారాశి- ప్రతికూలమైన రోజు, కార్యనష్టం, కలహాలు, చేసే పనిలో ఆటంకాలు.
పరిహారాలు: సూర్య ఆరాధన, నారాయణ సేవ అంటే పేదలకు అన్నం పెట్టండి.

తులారాశి- ప్రతికూలం. పనుల్లో నష్టం, వస్తునష్టం, అనారోగ్య సూచన.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, గోవుకు అరటిపండ్లు తినిపించండి మంచి జరుగుతుంది.

వృశ్చికరాశి- అనుకూలం. విందులు, వినోదాలు, స్నేహితులతో కలిసి ప్రయాణసూచన.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, చాలీసా పారాయణం చేసుకోండి.

ధనస్సురాశి- ప్రతికూలం. ఇంట్లోవారికి అనారోగ్య సూచన, పనుల్లో జాప్యం, మనఃశాంతి.
పరిహారాలు: గోసేవ, రావిచెట్టు ప్రదక్షణం, నమస్కారం, గణపతి ఆరాధన మేలు చేస్తుంది.

మకరరాశి- ప్రతికూల ఫలితాలు, అప్పులు, వాహనం వల్ల ఇబ్బందులు, అనుకోని ఇబ్బందులు.
పరిహారాలు: గోసేవ/ నారాయణ సేవ చేయండి మంచి ఫలితాలు వస్తాయి.

కుంభరాశి- అనుకూలమైన రోజు, ఆనందం, ధనలాభం, వస్త్రలాభం.
పరిహారాలు: అవసరమైనవారికి ఏదో ఒక సహాయం చేయండి. దానం, ధర్మం తప్పక చేయండి.

మీనరాశి- అనుకూల ఫలితాలు, లాభం, ధనవృద్ధి, పనులు పూర్తి.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, పేదలకు సహాయం చేయండి.

నోట్: నారాయణ సేవ అంటే మీకు చాతనైనంతలో ఎవరికో ఒకరికి అంటే పేదవారు, యాచకులు, వికలాంగులకు అన్నదానం చేయండి. అదీ వీలుకాకుంటే దగ్గర్లోని జీహెచ్‌ఎంసీ ఐదురూపాయల భోజన కేంద్రంలో పదో/ఇరవైయ్యో మీకు చాతనైనంత ఇచ్చి నలుగురికి భోజనం పెట్టమనండి. తప్పక మీకు మేలు జరుగుతుంది.
– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version